1.మీన రాశి..
మీన రాశిని నెప్ట్యూన్ పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడూ ఊహలతో బతికేస్తూ ఉంటారు. కానీ.. నిజ జీవితంలో ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ రాశివారు తమ భాగస్వామి భావోద్వేగాలకు బాగా అనుగుణంగా ఉంటారు. వారు ప్రేమ , దయతో కూడిన చర్యల ద్వారా తమను తాము వ్యక్తీకరించడానికి ఇష్టపడతారు. సంబంధాలలో, వారు తమ భాగస్వామి పట్ల చాలా నిస్వార్థంగా , సానుభూతితో ఉంటారు. ప్రేమలేఖలు రాయడం నుండి ఆకస్మిక పర్యటనల వరకు-- ప్రేమ విషయానికి వస్తే వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు.