Today Horoscope: ఓ రాశివారికి గ్రహాల అనుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు

Published : Jan 12, 2024, 05:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారు ఈ రోజు సంఘంలో ప్రముఖుల ఆదరణ పొందగలరు.మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల కలియక ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.   

PREV
113
 Today Horoscope: ఓ రాశివారికి  గ్రహాల అనుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు

12  -1-2024   శుక్ర వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

సంతానానికి సంబంధిత విషయాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడును. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కడం కష్టకరముగా ఉంటుంది.

313
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

వ్యాపారాల అభివృద్ధికి అవరోధాలు తొలగును. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆగిన జీతభత్యాలు చేతికి అందుతాయి . చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి విషయంలో అనుకూలంగా ఉంటుంది.గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

సంఘంలో ప్రముఖుల ఆదరణ పొందగలరు.మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల కలియక ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి ఉద్యోగాలు అనుకూల వాతావరణం.
 

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడును. పని ఒత్తిడి పెరుగుతుంది . ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి  నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మానసిక చికాకులు. ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు.
 

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఆర్థికాభివృద్ధి  బాగుంటుంది.ఋణాలు తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.. ఏ పని తలపెట్టిన అవలీలగా పూర్తి చేస్తారు. అధికార వర్గం తో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. గత కొద్ది కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు.
 

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

వృత్తి ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలు దూరంగా ఉండాలి. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనపడదు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త పడాలి. దైవదర్శనం చేసుకుంటారు. సోదరులతో  వివాదాలు రాగలవు.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయకూడదు.

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది. ఇతరులతో తొందరపాటు మాటలు మంచిది కాదు. శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.
 

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు. తలపెట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా ఉంటాయి.

1013
telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు.  కొత్త ఆలోచనలు కలసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. మొండి బాకీలు వసూలు అవును. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.  ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు.
 

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

తలపెట్టిన పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందజేస్తారు .వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. అప్రయత్నంగా అవకాశములు పొందగలరు.  వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు  తీసుకుంటారు. బంధుమిత్రుల యొక్క కలయిక.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సమయానకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం. వ్యవహారాలలో సలహాలు తీసుకొని వ్యవహరించడం మంచిది. విద్యార్థులు వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో పెద్దవారి సహకారాలు అందుతాయి. ప్రశంసలతో పాటు గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభ సాటిగా జరుగును. ఉద్యోగాల్లో సహోద్యోగులు సహాయ సహకారాలు లభిస్తాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories