ఈ రాశులవారు పెళ్లి చేసుకునే అవకాశం చాలా తక్కువ..!

Published : Dec 10, 2021, 04:41 PM IST

జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటూ ఉంటారు. అలాంటివారు ఎవరూ అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఏయే రాశులు జీవితంలో పెళ్లి జోలికి వెళ్లకూడదు అనుకుంటారనే విషయాన్ని చెప్పేయవచ్చట. వారెవరో ఓసారి చూద్దాం..

PREV
16
ఈ రాశులవారు పెళ్లి చేసుకునే అవకాశం చాలా తక్కువ..!

కొంత మంది ఎప్పుడెప్పుడు పెళ్లి  చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే...  కొందరు మాత్రం.. పెళ్లి అనే మాట వింటే  చాలు.. భయపడిపోతుంటారు.  పెళ్లి చేసుకోవడానికి జంకుతుంటారు. జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటూ ఉంటారు. అలాంటివారు ఎవరూ అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఏయే రాశులు జీవితంలో పెళ్లి జోలికి వెళ్లకూడదు అనుకుంటారనే విషయాన్ని చెప్పేయవచ్చట. వారెవరో ఓసారి చూద్దాం..

26

మిథున రాశి..

ఈ రాశివారి మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఈ రోజు తీసుకున్న నిర్ణయం.. రేపటికి అలా ఉండదు. వీరు తమ నిర్ణయాలను వెంట వెంటనే మార్చేసుకుంటూ ఉంటారు.  కాబట్టి.. వీరు జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండటం అనేది చాలా కష్టం. ఎవరైనా  తమను ఇష్టపడినా.. తమను కూడా ప్రేమించమంటూ వెంటపడటం లాంటివి చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ.. ఆ వెంటనే విసుక్కుంటారు.  దేనీనీ ఎక్కువ సేపు ఎంజాయ్ కూడా చేయలేరు.

36

సింహ రాశి..
ఈ రాశివారు పెళ్లి, రిలేషన్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. మొదట్లో కాస్త ఆసక్తి కలిగినా.. ఆ తర్వాత వెసుగు చెందుతారు.  వీరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలని.. వినోదాల్లో పాల్గొనాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఏవైనా సమస్యలు వచ్చినా, గొడవలు జరిగినా...పెళ్లంటే భయపడిపోతారు. ముందే.. వీటి గురించి ఆలోచించి.. పెళ్లే వద్దు అనే నిర్ణయం తీసుకుంటారు.

46

ధనస్సు రాశి..
వారు ఎవరితోనైనా కమిట్ అవ్వడానికి చాలా భయపడతారు, వారు  హార్ట్ బ్రేక్ కాకుండా  ఉండటానికి సంబంధంలోకి రాకుండా ఉంటారు. వారు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు, ఎందుకంటే వీరు స్వేచ్ఛగా ఉండాలని ఆరాటపడతారు. అందుకే అలా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని అనుకోరు. అందుకే వీరు  వివాహం చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.

56

కుంభ రాశి...
వారు సాంగత్యాన్ని ఎంతగా ప్రేమిస్తారో, ఏకాంతాన్ని కూడా ఇష్టపడతారు. వారు అంత తొందరగా ఎవరితోనూ మింగిల్ కాలేరు. వీరికి రొమాన్స్ అంటే ఆసక్తి ఎక్కువే.., కానీ పెళ్లి అంటే భయపడిపోతారు. పెళ్లి చేసుకోవడం అంటే చాలా బాధ్యతలను మోయడమని.. అది తమ వళ్ల కాదని వారు భయపడుతుంటారు.

66

మీన రాశి..
ఎవరినైనా ప్రేమించినా.. పెళ్లి చేసుకున్నా.. వారి అంచనాలకు తగినట్లు ఉండలేమో అని వీరు భయపడుతూ ఉంటారు. మీన రాశివారు ఊహించిన దాని ప్రకారం ఎవరైనా జీవించకపోతే, వారు వీలైనంత త్వరగా పారిపోతారు. వారు విషయాలను తేలికగా ఉంచుతారు, కానీ వారు ఖచ్చితంగా లేకుండా వివాహం వైపు అడుగులు వేయలేరు. 

Read more Photos on
click me!

Recommended Stories