అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒకే రకమైన స్వభావాన్ని, దృక్పథాన్ని కలిగి ఉండరు. కొందరు మొండిగా, ధైర్యంగా ఉంటారు. మరికొంతమంది ప్రతి దానికి భయపడతారు. సిగ్గు పడతారు. అయితే కొన్ని రాశుల వారిని కొంచెం పొగిడినా బుగ్గలు ఎర్రగా మారుతాయి. తెగ సిగ్గుపడిపోతుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే?
మేష రాశి
మేషరాశి వారికి పట్టుదల ఎక్కువ. వీరికి కుతూహలం కూడా చాలా ఎక్కువే. కానీ వీళ్లు చాలా కోపంగా కనిపిస్తారు. కానీ ఈ రాశికుర్రాళ్లు చాలా సున్నింతంగా ఉంటారు తెలుసా? అవును ఈ రాశి వాళ్లను కొంచెం పొగిడినా, ఇంకేదైనా మాట్లాడినా వెంటనే వారి ముఖాలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. వీళ్లు తమ సిగ్గు ముఖాన్ని వేరేవాళ్లకు చూపించడానికి ఇష్టపడరు. కానీ వీళ్లకున్న బిడియం మాత్రం ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.
కర్కాటక రాశి
చంద్రుడు ఈ రాశికి అధిపతి చంద్రుడు. కాబట్టి ఈ రాశివాళ్లు చాలా సున్నితంగా ఉంటారు. వీళ్ల ప్రవర్తనలో మనకు సిగ్గు కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్లు బాగా సిగ్గుపడిపోతుంటారు. కానీ వీళ్లది దయగల హృదయం. ఈ రాశివారు చాలా భావోద్వేగానికి లోనవుతారు. అలాగే ఇట్టే సిగ్గుపడిపోతారు.
తులా రాశి
ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఈ రాశి వాళ్లను ఎవరైనా తమ ముందుకు వచ్చి నేరుగా అభినందిస్తే బాగా సిగ్గుపడిపోతారు. వీళ్ల మనసు మల్లెపూలు లాంటిది. పొగడ్తలు, ప్రేమకు వీరు బాగా సిగ్గుపడతారు.
మీన రాశి
ఈ రాశి వారు డ్రీమర్స్. వీళ్లు తొందరగా ఊహాలోకంలోకి వెళ్లిపోతారు. ఈ లక్షణాన్ని చూసి వారు చాలా త్వరగా సిగ్గుపడతారు. అలాగే వీళ్లు తొందరగా భావోద్వేగానికి గురవుతారు. ఇలాంటి సమయంలో వీళ్ల ముఖ కవళికలు కూడా మారుతాయి