
వార ఫలాలు : 7-4-2024 నుండి 13-4-2024 వరకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.సంఘంలో గౌరవం మర్యాదలు పొందగలరు.శారీరక మానసిక శాంతి చేకూరును.చేయు వ్యవహారాల్లో సరైన ఆలోచనలతో వ్యవహరిస్తారు.ఆర్థికంగా బాగుంటుంది.విద్యార్థుల ప్రతిభ కనబరుస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ క్రయ విక్రయాలు సజావుగా సాగును. సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాగలవు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
శుభవార్తలు వింటారు.బంధు మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.సహోదరుల సహకారం లభిస్తుంది. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. శుభకార్యములకు ధనం ఖర్చు చేస్తారు.వ్యవహార విషయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.రావాల్సిన బకాయిలు వసూలు అవును.పోయిన వస్తువులు తిరిగి లభించును.ఉద్యోగాలు లో అధికారుల ఆదర అభిమానం పొందగలరు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.వారాంతంలో వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఆర్థిక లావాదేవీలు లో అప్రమత్తత అవసరం.రుణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి.చేసే పనిలో శ్రమ పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగ విషయాలు చిరాకు గా ఉంటాయి. సంఘములో విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.సోదరులతో విభేదాలు తలెత్తవచ్చు.ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి.బంధు మిత్రులతో మాట పట్టింపులు రాగలవు.అనారోగ్యం సమస్యలు ఏర్పడగలవు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.కుటుంబ వ్యవహారాలు లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.సంతానం తో కలహాలు రాగలవు. చేయు పనులు లో సరైన ఆలోచన లేక ఇబ్బందులు కలుగును. వారాంతంలో నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
తలచిన పనులు లో ఇబ్బందులు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగును. సమాజంలో అవమానాలు ఏర్పడగలవు.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది.మానసిక ఒత్తిడికి గురి కావచ్చు.శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.దూరాలోచన కి దూరంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం మంచిది.కుటుంబంలో చికాకులు సమస్యలు రాగలవు.కీలకమైన నిర్ణయాలు లో తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు రాగలవు. అనవసరమైన ఖర్చులు పెరిగి ఆందోళన కలుగును.వారాంతంలో వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
మిత్రులు సహాయ సహకారాలు అందజేస్తారు.మనసులో తలచిన అన్ని కార్యాలు నెరవేరుతాయి.మనోధైర్యం పెరుగుతుంది.ప్రయాణాలు లాభిస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉండును.ఉద్యోగాలు లో సత్కారాలు పొందగలరు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. సంతోషకరమైన వార్త వింటారు.సుఖ సౌఖ్యములు మొదలగు అన్ని లభించును.కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.విద్యార్థులు విద్యలో రాణిస్తారు. వారాంతంలో చెడు వార్త వినవలసి వస్తుంది.చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తగలవు.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
చేయు పనులు లో లాభం పొందుతారు.సంతోషంగా గడుపుతారు. భూ గృహ క్రయ విక్రయాలు లో లాభం పొందుతారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థుల ప్రతిభ కనబడుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆకస్మిక ధన లాభం లభిస్తుంది.సంతాన అభివృద్ధి సంతోషం కలిగించును.పోయిన వస్తువు తిరిగి లభించును.సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంటాయి.అన్నదమ్ముల సహకారంతో ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.సంతాన వృద్ధి కొరకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు శుభవార్త వింటారు.ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. వారాంతంలో రుణాలు ఇవ్వడం పుచ్చుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తలచిన కార్యములు ఆలస్యం కాగలవు. సమాజంలో గౌరవం తగ్గును.శారీరక పీడ పెరుగుతుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తోబుట్టువులతో విభేదాలు ఏర్పడగలవు.అన్ని విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.వ్యవహారాలు లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.పరిశ్రమల వారికి మిశ్రమ ఫలితాలు లభించును. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉండటంతో ఇబ్బందులు పడతారు.మానసికంగా భయాందోళన గా ఉంటుంది.ఇతరులతో విరోధాలు ఏర్పడగలవు.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బంది ఏర్పడవచ్చు.వారాంతంలో శుభవార్త వింటారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
చేయు పనులు లో శారీరక శ్రమ పెరుగుతుంది.ఉద్యోగాలు లో అధికారులు తో కలహాలు ఏర్పడగలవు.అకారణంగా ఇతరులతో విరోధాలు ఏర్పడవచ్చు. సమాజంలో అపకీర్తి రాకుండా జాగ్రత్తలు పాటించాలి.అనుకోని సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.దూరపు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరుల మీద అసూయ ఈర్ష్య ద్వేషాలు పెరుగుతాయి.తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును.ఇంటా బయట వ్యతిరేకత గా ఉంటుంది.అనేక ఆలోచనలు మానసిక ఒత్తిడికి లోనవుతారు.స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం.వారాంతంలో బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.ఆనందంగా గడుపుతారు.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
వ్యవహారాలలో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.జీవన విధానం అనుకూలంగా ఉంటుంది. కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ప్రతి పని ధైర్యసహసాలు తో పూర్తి చేస్తారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న రుణ బాధలు తొలగును.శుభకార్యాల వల్ల ఖర్చు పెరుగుతుంది.రావలసిన సొమ్ము తిరిగి లభించును.నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు.స్థిరాస్తి కొనుగోలు కు అనుకూలం.వారాంతంలో అనేక ఆలోచనలు తో చికాకులు గా ఉంటుంది.అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.వ్యాపార భాగస్వాములు తో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
వాహన ప్రయాణంలో యందు జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనులు నిదానంగా సాగును.భూ స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.సంతానం తో అకారణంగా కలహం ఏర్పడును.చేసే పనుల్లో బుద్ధి సూక్ష్మత తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి.గృహంలో పెద్ద వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.మానసిక భయాందోళన గా ఉండును.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సమాజంలో అవమానాలు కలుగ గలవు.వ్యవహారమంతా తికమక గా ఉంటుంది. వారాంతంలో ఆరోగ్యం అనుకూలించును.సంతోషకరమైన వార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
స్థిరాస్తి విషయాలు చిరాకు పుట్టిస్తాయి.మనస్సులో ఆందోళన గా ఉంటుంది. సంతానము నుండి ప్రతికూలత వాతావరణం.చేసే పనిలో సరైన ఆలోచనలతో నిర్ణయం తీసుకోవాలి.మానసిక బాధలు పెరుగుతాయి శత్రువుల వలన అపకారం జరగవచ్చు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన వస్తువులు లందు జాగ్రత్త అవసరం. సోదరి సోదరులు కలహాలు ఏర్పడగలవు.విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి.ఉద్యోగాలు లో అధికారులు తో సమస్యలు చాకచక్యంగా వ్యవహరించి పరిష్కరించవలెను. వారాంతంలో సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.మానసిక ఆనందాన్ని పొందగలరు.చేయు ప్రయాణాలు లాభిస్తాయి.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలు లో అధికారులు తో సమస్యలు రాగలవు.స్థిరాస్తి క్రయ విక్రయాలు విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.బంధుమిత్రులతో కొద్దిపాటి విరోధాలు రాగలవు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.చేసే పనిలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి.కుటుంబ వ్యవహారాలు లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారాంతంలో దీర్ఘకాలిక అనారోగ్య విషయాలు లో ఉపశమనం పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు
మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)