Birth Dates: పెళ్లి తర్వాత ఎవరి జీవితం అయినా మారుతుంది. కొందరి జీవితంలో పెళ్లి ఆనందాలు తీసుకొస్తే.. మరి కొందరికి కష్టాలు రావచ్చు. అయితే, ఈ జీవితం ఎలా ఉంటుంది అనేది మనం పుట్టిన తేదీపై ఆధారపడి ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు అని అందరూ చెబుతుంటారు. పెళ్లి తర్వాత జీవితం మారడం చాలా సహజం. అయితే, పెళ్లి కేవలం ప్రేమ, అనుబంధం మాత్రమే కాదు... లైఫ్ స్టైల్, ఆర్థిక పరిస్థితిని కూడా మార్చేస్తుంది. కొందరికి శుభ పరిమాణాలు కలిగిస్తే... మరి కొందరికి సమస్యలు తెచ్చి పెట్టవచ్చు. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి వివాహం తర్వాత అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా సంపద, కెరీర్ వంటి విషయాల్లో మంచి పురోగతి సాధించగలరు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా....
24
6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు..
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శుక్ర గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అంటే ప్రేమ, సౌందర్యం, ఐశ్వర్యం, భౌతిక సౌకర్యాలకు ప్రతీక. ఈ తేదీల్లో జన్మించిన వారు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు జీవితంలో ఎప్పుడూ సామరస్యాన్ని కోరుకుంటారు. వివాహం తర్వాత వీరి జీవితంలో స్థిరత్వం పరుగుతుంది. అదే స్థిరత్వం కొత్త అవకాశాలను ఆకర్షించేలా చేస్తుంది. ఆర్థిక వృద్ధిని కూడా తెస్తుంది. వ్యాపారం, ఉద్యోగం , పెట్టబడుల విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.
34
8, 17,26 తేదీల్లో పుట్టిన వారు...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా పెళ్లి తర్వాత అద్భుతంగా కలిసొస్తుంది. వీరు జీవితంలో చాలా ఎక్కువగా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. శని గ్రహం కారణంగా అన్ని పనులు ఆలస్యం అవుతాయి. కానీ, ఒక్కసారి వచ్చాయి అంటే శాశ్వతంగా ఉంటాయి. వీరికి పెళ్లి మంచి జీవితాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. ముఖ్యంగా వ్యాపారం, రియల్ ఎస్టేట్, పెట్టుబడులు వంటి రంగాల్లో విజయాలు సాధించగలరు.
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. తేదీల్లో పుట్టిన వారిపై అంగారకుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వీరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ఉంటారు. పెళ్లి తరవాత వీరి జీవితం చాలా ఆనందంగా మారుతుంది. కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు.
ఫైనల్ గా...
వివాహం అందరికీ మంత్రదండంలా పని చేయకపోయినా, పై తేదీల్లో జన్మించినవారికి మాత్రం అది అదృష్టాన్ని వేగంగా మార్చే కీలక ఘట్టంగా మారుతుంది. ప్రేమతో పాటు సంపద, స్థిరత్వం , విజయం కూడా జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.