Raja Yogam: శని దేవుడి వల్ల 2027 వరకు రాజయోగాన్ని ఎంజాయ్ చేసే 3 రాశులవారు వీరే

Published : Jun 15, 2026, 10:17 AM IST

Raja Yogam: శని దేవుడు చెడు పరిస్థితులనే కాదు.. కొన్ని రాజయోగాలు ఏర్పడినప్పుడు మంచి కూడా చేస్తాడు. ఆయన మనం పడే కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు.  2027 జూన్ వరకు శని సంచారం వల్ల 3 రాశుల వారికి రాజయోగం పడుతుంది.

PREV
13
వృషభ రాశి

వృషభ రాశి వారికి 2027 వరకు తిరుగే ఉండదు. చిన్న చిన్న సమస్యలు మధ్యలో వచ్చిన అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే వారికి శని దేవుడి కరుణ ఉంది. వీరికి చాలా కాలం అనుకూలంగా ఉండబోతోంది. ఎంతో కాలంగా పూర్తికాకుండా ఆగిన పనులన్నీ ఇప్పుడు ఊపందుకుంటాయి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా అవన్నీ దూదిపింజలా ఎగిరిపోతాయి. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి అవకాశం. కష్టపడితే సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్ధికంగా కూడా వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వీరి ఆదాయం బాగా పెరుగుతుంది.  ఈ సమయంలో సొంత ఇల్లు లేదా ఆస్తులు కొనే అవకాశం ఉంది.

23
కన్యా రాశి

కన్యా రాశి వారికి 2027 జూన్ వరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా కాలంగా పడుతున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.  భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి తగిన జోడీ దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులలో ఈ రాశి వారికే అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది.

33
మకర రాశి

శని దేవుడి సొంత రాశి మకర రాశి. వీరికి 2027 జూన్ వరకు ఒక స్వర్ణయుగం అనే చెప్పుకోవాలి. వీరు పడిన కష్టానికి పూర్తి ఫలాలను అందుకుంటారు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం.  ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు లేదా ఇంక్రిమెంట్ పడొచ్చు. సమాజంలో వీరి హోదా కూడా బాగా పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories