Money Zodiac Signs: ఈ 5 రాశుల వారి చేతిలో డబ్బు అస్సలు నిలవదు, డబుల్ ఖర్చు చేస్తారు

Published : Jan 02, 2026, 05:01 PM IST

Money Zodiac Signs: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం ఒక్కో రాశి వారికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే  5 రాశుల వారికి చేతిలో డబ్బు నిలవదు. పొదుపు చేయడం వీరికి రాదు. రెట్టింపు ఖర్చులు చేస్తారు. 

PREV
15
మేష రాశి

మేషరాశి వారు స్వభావరీత్యా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వీరు ఏ విషయంలోనైనా గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి కంటికి ఏదైనా నచ్చితే అది కొనేవరకు నిద్రపోలేరు. వెంటనే కొనేస్తారు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు చేయడంలో ఈ రాశి వారికి ఆనందం ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని విషయాల్లోనూ డబ్బులు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే వీరి చేతిలో డబ్బులు నిలవడం చాలా కష్టం.

25
వృషభ రాశి

వృషభ రాశి వారు డబ్బు సంపాదించడంలో మంచి నిపుణులు. అలాగే ఆ డబ్బును ఖర్చు చేయడంలో కూడ ముందుంటారు.  వీరు జీవితాన్ని ఆనందంగా జీవించేందుకు ఇష్టపడతారు.  ప్రతి క్షణాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తారు.  సౌకర్యాలకు, అందానికి వీరు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు. పర్సు త్వరగా ఖాళీ చేసేస్తారు.

35
సింహ రాశి

సింహ రాశి వారి జీవితంపై సూర్యుని ప్రభావం ఎక్కువ. ఎక్కడైనా రాజాలా, నాయకుడిలా గొప్పగా బతకాలనుకుంటారు.  మీరు జీవితాన్ని పూర్తిగా తమకు నచ్చినట్టు జీవించాలని కోరుకుంటారు. పార్టీలు, సామాజిక కార్యక్రమాల కోసం విలాసవంతంగా ఖర్చు చేస్తారు. తమకు నచ్చిన వస్తువులు కొనడానికి  ఏమాత్రం వెనుకాడరు. వీరికి డబ్బు ఖర్చుచేయడంలో ఎంతో ఆనందం ఉంది.

45
తులా రాశి

తులా రాశి వారికి వస్తువులు కొనడం అంటే చాలా ఇష్టం. నిత్యం షాపింగ్ కు వెళుతూ ఉంటారు.  ఫ్యాషన్, కాస్మోటిక్స్ వంటి వాటిపై ఆసక్తి  చూపిస్తారు. బట్టలు, బూట్లు వంటివి అధికంగా కొంటూ ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టడంలో వీరికి ఆనందం ఉంటుంది. ఆన్ లైన్ షాపింగ్ ను బాగా ఇష్టపడతారు. ఖాతాలో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది.

55
కుంభ రాశి

కుంభ రాశి వారికి దుబారా ఖర్చు ఎక్కువ. వీరి మనసు కూడా మంచిది. ఉదారంగా దానం చేస్తారు.  డబ్బు తమకోసం మాత్రమే కాదు… ఇతరులకు సహాయం చేయడానికి వాడతారు. అధికంగా దానాలు చేస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న సమస్యలను తీర్చేందుకు కూడ ఖర్చు చేస్తూ ఉంటారు. అందుకే వీరి దగ్గర డబ్బులు పొదుపు చేయడం అనేది జరగదు.

Read more Photos on
click me!

Recommended Stories