Zodiac signs: ఈ రాశులవారు అద్భుతంగా పాటలు పాడగలరు, సూపర్ సింగర్స్..!

Published : Oct 09, 2025, 01:15 PM IST

Zodiac signs: తీయని గొంతు ఉండటం గొప్ప వరం అని చెప్పొచ్చు. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు. కానీ.. కొన్ని రాశులవారికి మాత్రం పుట్టుకతోనే ఈ టాలెంట్ ఉంటుంది. 

PREV
16
Zodiac signs

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తమలో ఉన్న టాలెంట్ ని గుర్తించి... జీవితంలో గొప్ప విజయాలు సాధించేవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి టాలెంట్ లో సింగింగ్ కూడా ఒకటి. మధురమైన గొంతు ఉన్నవారు తమ పాటలతో అందరినీ ఉత్సాహపరచగలరు. గ్రహాల ప్రభావం కారణంగా కూడా కొందరికి ఈ టాలెంట్ పుట్టుకతోనే వస్తుందని జోతిష్య శాస్త నిపుణులు చెబుతున్నారు. మరి, ఇలాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న రాశులేంటో ఓసారి చూద్దాం...

26
1.మేష రాశి...

మేష రాశిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది. అందుకే అన్ని రాశుల కంటే ఈ రాశివారు కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు. ఇతరులు ఎవరికీ లేని మధురమైన స్వరం వీరి సొంతం. వీరి పాటలకు చాలా డిమాండ్ ఎక్కువ. కుటుంబం, స్నేహితులు వీరి పాటలకు ఎక్కువ ఫిదా అయిపోతారు. సంగీతం నేర్చుకోకపోయినా.. వీరు అద్భుతంగా పాటలు పాడగలరు. వీరి పాటలను అందరూ ప్రశంసిస్తారు. వీరు కేవలం గాయకులు మాత్రమే, వారు గొంతు చాలా మృదువుగా ఉంటుంది. స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

36
వృషభ రాశి...

వృషభ రాశిని శుక్ర గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు చాలా ధైర్యవంతులు. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. వృషభ రాశివారికి టాలెంట్ చాలా ఎక్కువ. అన్ని రంగాల్లో తమను తాము ప్రూవ్ చేసుకుంటారు. వీరు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. ఇక.. ఈ రాశివారిలో సింగింగ్ టాలెంట్ కూడా ఉంది. అద్భుతంగా పాటలు పాడగలరు. శిక్షణ తీసుకుంటే... వీరు గొప్ప సింగర్ కాగలరు.

46
వృశ్చిక రాశి...

వృశ్చిక రాశిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశి వారిలో ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితుల ముందు తమ సింగింగ్ టాలెంట్ చూపించి.. వారికి ఆకట్టుకుంటూ ఉంటారు. సింగింగ్ ని కెరీర్ గా ఎంచుకుంటే వీరు గొప్ప స్థాయికి వెళ్లగలరు

56
మకర రాశి....

మకర రాశిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. పాటలు పాడటం వీరికి పుట్టుకతోనే వచ్చేస్తుంది. వీరు సంగీతం నేర్చుకోకపోయినా, మంచిగా పాడగలరు. అలాంటి టాలెంట్ వీరి సొంతం. సంగీత వాయిద్యాలు కూడా వాయించగలరు. ఇదొక్కటే కాదు... వీరు ఏదైనా సరే, చాలా తక్కువ సమయంలోనే నేర్చుకోగలరు. స్వయం కృషి ఎక్కువ.

66
మీన రాశి...

మీన రాశిని బృహస్పతి పాలిస్తుంది. ఈ రాశివారు చిన్న వయసులోనే తొందరగా శ్లోకాలు, మంత్రాలు, దేవుని పాటలు నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దేవుళ్లకు సంబంధించిన మధురమైన పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంటారు. వీరికి క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువ. ఏదైనా చాలా శ్రద్ధగా నేర్చుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories