కుంభ రాశి..
కుంభ రాశివారు చాలా తెలివైనవారు.వారు ఏ రంగంలో అడుగుపెట్టినా, అందులో విజయం సాధించగలరు. వీరి మైండ్ కూడా చాలా షార్ప్. వీరు తొందరగా ఏ విషయాన్నీ మర్చిపోలేరు.వీరు ప్రతి విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకుంటారు. ఎవరినైనా కలిసినప్పుడు వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారు చూపు, మాట తీరు, ప్రవర్తనా అన్నీ గుర్తుంచుకుంటారు. వాటి ఆధారంగా ఎప్పుడో చూసిన వ్యక్తిని కూడా వీరు గుర్తించుకోగలరు.చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోరు.