Zodiac Signs: ఈ 4 రాశుల వారికి అసూయ ఎక్కువ, ఇతరుల విజయాన్ని సహించలేరు

Published : Nov 24, 2025, 07:52 AM IST

Zodiac Signs: కొందరికి అసూయ ఎక్కువ. ఇతరులు బాగున్నా, సంతోషంగా ఉన్నా, విజయం సాధించినా భరించలేరు. వీరి తల చెడు ఆలోచనలతో నిండిపోతుంది. ఇలాంటి లక్షణాలున్న రాశుల వారు ఎవరో తెలుసుకోండి.  

PREV
15
అసూయ పడే రాశులు

జీవితంలో విజయం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరు తమ కష్టంతో విజయాన్ని సాధిస్తారు. ఎదుటివారి విజయాన్ని చూసి సంతోషించాలే కానీ బాధపడకూడదు. కానీ కొన్ని రాశు వారు మాత్రం ఎదుటి వారి విజయాన్ని చూసి అసూయ పడతారు. వారి విజయాన్ని వీరు తట్టుకోలేరు. ఎదుటివారు సంతోషంగా ఉంటే భరించలేరు. అలాంటి రాశుల గురించి తెలుసుకోండి.

25
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువ. ప్రతి చిన్న దానికి ఫీలవుతూ ఉంటారు. ఇతరులు విజయం వీరికి బాధను కలిగిస్తుంది. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం తెగ అసూయపడతారు. పోటీతత్వం వీరిలో చాలా తక్కువ. ఇతరుల విజయాన్ని సహించే శక్తి వీరికి లేదు.  కానీ తమలోని అసూయను మాత్రం బయటపెట్టరు.

35
మేష రాశి

మేష రాశి వారు నిజానికి  యోధుల్లా పోరాడుతారు. కాకపోతే ఎప్పుడూ  తామే గెలవాలని కోరుకునే మనస్తత్వం వీరిది.  ఇతరులు తమపై గెలిస్తే భరించలేరు. చాలా బాధపడతారు. వీరికి అహం కూడా ఎక్కువ.  ఇతరుల విజయాన్ని వీరు చూడలేరు.

45
మకర రాశి

మకర రాశి వారు కూడా అసూయ పడే వారి జాబితాలోకే చేరతారు. వీరికి ఆశయాలు ఎక్కువే. వాటికోసం ఎంతో కష్టపడతారు కూడా.  కానీ తమ కళ్ల ముందే ఇతరులు ఉన్నత స్థానాలకు చేరుకుంటే మాత్రం బాధపడతారు. నిరాశలోకి వెళ్లిపోతారు. వీరికి  అదృష్టం ఎక్కువ కలిసివస్తుంది. దీని వల్ల కూడా వీరికి విజయం దక్కుతుంది.

55
సింహ రాశి

సింహ రాశి వారికి అహం ఎక్కువ. ఎప్పుడూ తామే మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఇతరులు తమకన్నా ముందుకు వెళితే భరించలేరు. వీరికి పొగడ్తలంటే చాలా ఇష్టం. తమ కన్నా ఇతరులకు మంచి గుర్తింపు వస్తే సహించలేరు. చాలా అసూయ పడతారు. ఇతరులకు విలువ ఇస్తే భరించలేరు.

Read more Photos on
click me!

Recommended Stories