Zodiac Signs: పొదుపు చేయడంలో ఈ 4 రాశుల వారు టాప్, బోలెడు కూడబెట్టేస్తారు

Published : Jan 06, 2026, 10:41 AM IST

Zodiac signs: జ్యోతిషం ప్రకారం కొన్ని రాశులలో జన్మించిన వారు డబ్బును ఆదా చేయడంలో నిష్ణాతులు. డబ్బు ఆదా చేసినంత మాత్రాన వీరు పిసినారులు మాత్రం కాదు. డబ్బును మాత్రం చాలా జాగ్రత్తగా వినియోగిస్తారు.

PREV
15
డబ్బు ఆదా చేసే రాశులు ఇవే

డబ్బు సంపాదించడం అందరివల్లా కాదు. అది ఒక కళ. అలాగే సంపాదించిన డబ్బును దాచుకోవడం కూడా అందరికీ రాదు. డబ్బు పొదుపుగా ఆదా చేయడం అందరికీ రాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకరి రాశిని బట్టి వారి డబ్బు సంపాదించడం, ఆదా చేయడం వంటి అలవాట్లు వస్తాయి. కొందరు భవిష్యత్ అవసరాల కోసం డబ్బు ఆదా చేయడంలో ముందుంటారు. ఏ రాశుల వారు డబ్బు పొదుపు చేయడంలో నిష్ణాతులో తెలుసుకోండి.

25
వృషభం

వృషభ రాశి వారిపై శుక్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే వీరికి అందమైన, విలాసవంతమైన జీవితం దక్కుతుంది. అలాగే వీరు పొదుపు చేయడంలో ముందుంటారు.  దానికంటే సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు. వస్తువు కొనే ముందు అది అవసరమా లేదా  అని పదే పదే ఆలోచించి కొంటారు. వీరి పొదుపు దీర్ఘకాలిక పెట్టుబడిగా చాలా ఉపయోగపడుతుంది.

35
కన్యా రాశి

కన్య రాశి వారిపై బుధుడి ప్రభావం అధికంగా ఉంటుంది. బుధుడు తెలివికి అధిపతి. అందుకే వీళ్ళు మంచి అకౌంటెంట్లుగా ఉంటారు. కెరీర్ అలాగే ఎంపికచేసుకుంటే మంచిది. వీరు  అనవసర ఖర్చులను చాలా వరకు తగ్గిస్తారు. ప్రతి నెలా ఎంతొకొంత మొత్తమైనా ఆదా చేసే అలవాటు ఉంటుంది. బడ్జెట్ ప్లానింగ్‌ చేయడంలో వీరు నిష్ణాతులు.

45
మకర రాశి

మకర రాశి వారిపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే వీరు కష్టపడి పనిచేయడానికి, క్రమశిక్షణకు పెట్టింది పేరు.  వీరికి డబ్బు బాగా తెలుసు. వీరికి సొంత ఇల్లు కొనేందుకు డబ్బులు ఆదా చేస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి కోరికలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులు వారిని పిసినారులు అని పిలుస్తున్నా… వారు పట్టించుకోరు. వారు పొదుపుపైనే దృష్టి పెడతారు. 

55
వృశ్చిక రాశి

కుజుడి ప్రభావం అధికంగా ఉన్న రాశి వృశ్చికం.  వీళ్లు ప్రతి విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు. అందుకే డబ్బును దాచుకుంటారు.  డబ్బు దొరికినప్పుడల్లా రహస్యంగా దాచేసుకుంటారు. అనవసరమైన వస్తువులు కొనేందుకు ఏమాత్రం ఇష్టపడరు.

Read more Photos on
click me!

Recommended Stories