5.వృశ్చిక రాశి..
సూర్యుడు నేరుగా వృశ్చిక రాశిలోనే ప్రవేశిస్తుండటంతో ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అవుతాయి. కెరీర్‌లో తిరుగులేని పురోగతి సాధించడానికి , మీ సత్తా నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. వ్యాపారస్తులు కొత్త ప్లాన్లతో ముందుకు వెళ్తూ మంచి వృద్ధిని చూస్తారు. ధన సంపాదనకు సంబంధించి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిది, అలాగే ఓర్పు, విచక్షణతో వ్యవహరిస్తే తిరుగులేని విజయాలు సొంతమవుతాయి.