ఈ రాశి తల్లిదండ్రులకు.. ఏ రాశి పిల్లలు పుడితే హాయిగా ఉంటుందో తెలుసా?

First Published Jan 26, 2022, 11:15 AM IST

అందుకే పిల్లలతో.. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకుండా చూసుకోవాలట. పిల్లలతో కలిసి అన్ని విషయాలను మనం కూడా అవగాహన తెచ్చుకోవాలట. ఈ సంగతి పక్కన పెడితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల తల్లిదండ్రులకు.. కొన్ని రాశుల పిల్లలు పుడితే.. వారి మధ్య అవగాహన బాగుంటుందట.

parent astro

పేరెంటింగ్ అంత సులవైన పనేమీ కాదు. పిల్లలను పెంచడం అయితే.. నిత్యం సవాళ్లతో నిండుకున్న పని. దీనికి ముగింపు అనేది ఉండదు. ఒక విషయంలో వారికి సర్దిచెప్పాం అనుకునేలోపు.. మరో  విషయంలో అలిగి కూర్చుంటారు. పిల్లల పెంపకం మనకు అంత కష్టతరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా..? వారికి మనకీ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలేనట. అందుకే పిల్లలతో.. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకుండా చూసుకోవాలట. పిల్లలతో కలిసి అన్ని విషయాలను మనం కూడా అవగాహన తెచ్చుకోవాలట. ఈ సంగతి పక్కన పెడితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల తల్లిదండ్రులకు.. కొన్ని రాశుల పిల్లలు పుడితే.. వారి మధ్య అవగాహన బాగుంటుందట.  ఇలాంటి పిల్లలు ఉంటే.. వారికి పెద్దగా సమస్యలు ఉండవట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

parent

1.మేష రాశి- సింహ రాశి..
మేష రాశి- సింహ రాశులు పేరెంట్ -చైల్డ్ అయితే.. వారి మధ్య అండర్ స్టాండింగ్ చాలా బాగుంటుంది. వీరి ఆలోచనలన్నీ ఒకేలా ఉంటాయి.  వీరి లక్షణాలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఈ రెండు రాశుల వారు ఎక్కువగా ఎమోషనల్ పర్సన్స్. కానీ.. దానిని తొందరగా బయట పెట్టరు. ఈ రెండు రాశులు మాత్రం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అందుకే.. వీరు కనుక పేరెంట్- చైల్డ్ అయితే.. వారికి చాలా బాగుంటుంది. ఇలా ఉంటే.. పేరెంటింగ్ కాస్త సులువుగా ఉంటుందని చెప్పొచ్చు.

parents

2.వృషభ రాశి- కన్య రాశి..
ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు రాశులు.. పేరెంట్ - చైల్డ్ అయితే.. వారి రిలేషన్ అందంగా ఉంటుంది. ఈ రెండు రాశులకు సహనం ఎక్కువ. పట్టుదల కూడా అంతే ఎక్కువ.  ఆలోచనలు ఒకేలా ఉంటాయి కాబట్టి.. వారి మధ్య అండర్ స్టాాడిగ్ కూడా అలానే ఉంటుంది. వీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.

3.మిథున రాశి- కుంభ రాశి..
ఈ రెండు రాశులు పేరెంట్- చైల్డ్ అయితే.. వారి మధ్య బాలెన్సింగ్ బాగుంటుంది. ఒకరికి కావాల్సిన పని మరొకరు చేయగలరు. ఒకరు నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే మరొకరు సలహాలు ఇచ్చి సహాయం చేస్తారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలరు.ప్రేమను కూడా అంతే బాగా పంచుకోగలరు. 

4.కర్కాటక- మకర రాశి..
ఈ రెండు రాశులు కూడా అంతే..  పరిస్థితిని సమతుల్యం చేసుకోవడం లో ఒకరికొకరు సహాయపడతాయి. కర్కాటక రాశివారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా, మకరరాశి వారు భావోద్వేగాలకు ఎక్కువ విలువ ఇస్తారు కానీ.. వాస్తవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు రాశుల మధ్య అవగాహన చాలా బాగుంటుంది.

5.తుల రాశి- సింహరాశి..
తులారాశివారు సౌమ్యంగా, ప్రేమగా ఉంటారు, అయితే సింహరాశివారు ఆప్యాయత  కలిగి ఉంటారు. అయితే.. సింహ రాశివారు చేసే పొరపాట్లను  తుల రాశివారు సరిచేస్తూ ఉంటారు. ఈ రెండు రాశుల మధ్య అవగాహన బాగుంటుంది.

6.వృశ్చిక రాశి- మీన రాశి

ఈ రెండు రాశులకు ఎమోషన్స్ చాలా ఎక్కువ.  సంభాషణలు ఎక్కువగా కొనసాగించగలరు. ఈ రెండు రాశులు ఒకదానికి మరొకటి పూర్తిగా సహకరించుకుంటాయి. అన్ని చర్యలను అర్థం చేసుకుంటాయి. 

7.ధనస్సు రాశి- మిథున రాశి..
ధనస్సు రాశి, మిథున రాశులు.. అన్ని విషయాల్లో ఒకరినొకరు సహకరించుకుంటారు. ఈ రెండు రాశులు స్వేచ్ఛా జీవులు. కాబట్టి.. ఒకరికి ఏం కావాలి.. ఏం వద్దు అనే విషయం వారికి పూర్తిగా తెలుస్తుంది.  వీరి అభిప్రాయాలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఈ రెండు రాశుల కాంబినేషన్ చాలా బాగుంటుంది.

parenting

8.మకర రాశి- మీన రాశి..
మకర రాశివారు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి సహనం కూడా చాలా ఎక్కువ. విశ్వసనీయత కూడా అంతే ఎక్కువ. ఈ కారణాలతో వీరు గొప్ప తల్లిదండ్రులుగా పేరొందుతారు. వీరు తమ పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దగలరు.  మీన రాశి కి చెందిన  పిల్లలు ఉంటే.. వీరి మధ్య అవగాహన ఉంటుంది.

click me!