పెళ్లైన కొత్తలో జీవితం ఎవరికైనా కొత్తగా, అందంగా ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే... కొంత కాలం తర్వాత.. ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది. చీటికి మాటికీ.. ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కొందరికైతే చివరకు విడాకుల దాకా వెళ్తుంది వ్యవహారం. సాధారణంగా జాతకంలో అధిపతిపై ప్రభావం ఉంటే, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవ పడతాడు. 7వ ఇంటి గ్రహం దోషం ఉంటే, దంపతుల లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉండదు.