Sun Yama Conjunction: సూర్య యమ సంయోగంతో ఈ 3 రాశుల తలరాత మారిపోతుంది

Published : Jan 22, 2026, 04:48 PM IST

Sun Yama Conjunction: సూర్యుడు, యముడు సంయోగం వల్ల మూడు రాశుల వారికి అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. సూర్యుడు,  యముడు తండ్రీకొడుకులు అవుతారు. వీరిద్దరి కలయిక వల్ల మూడు రాశుల వారికి బాగా కలిసొస్తుంది. 

PREV
14
సూర్య యమ కలయిక

గ్రహాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. దీని వల్ల యోగాలు, సంయోగాలు ఏర్పడుతాయి. జనవరి 23, 2026న సూర్యుడు, యముడు కలిసి ప్రత్యేక సంయోగాన్ని ఏర్పరుస్తారు. యముడిని సూర్యుని కుమారుడు, ధర్మరాజు అంటారు. యముడు గ్రహం కాదు. జ్యోతిష శాస్త్రంలో శని గ్రహాన్ని యముడితో సమానంగా పరిగణిస్తారు. మకర రాశికి అధిపతి శని. రాశులలో శని గ్రహ స్థానం, యముడితో సంబంధం ఉన్న గ్రహాల కలయికల ద్వారా అతని ప్రభావం కనిపిస్తుంది. అలా సూర్యుడు, యముడి కలయిక జరగబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి ఎంతో లక్కీ అని చెప్పాలి.

24
మేష రాశి

జనవరి 23న సూర్య యమ సంయోగా జరుగుతుంది. ఇది మేషరాశి వారికి ఎంతో శుభప్రదమైనది. సూర్య-యమ సంయోగం వారి పడ్డ కష్టానికి మంచి ఫలితాలను అందిస్తుంది. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఊహించినట్టు ఆర్ధికంగా వీరు బాగా లాభాలు పొందుతారు. వీరు పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది.

34
సింహ రాశి

జనవరి 23న ఏర్పడే ఈ సూర్య యమ సంయోగం సింహరాశి వారికి బాగా కలిసొస్తుంది. వీరు ఈ కాలంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. సూర్య యమ సంయోగం ఈ రాశివారి జీవితంలో మంచి స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. వీరు చేసే వృత్తిలో పురోగతి ఉంటుంది. దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికున్న ఆరోగ్య సమస్యలు కూడ తగ్గిపోతాయి ఆరోగ్యం బాగవుతుంది.

44
మకర రాశి

మకరరాశి వారికి జనవరి 23 నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. సూర్య యమ సంయోగం అనేది వారి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ రాశి వారికున్న ఆర్థిక కష్టాలు తీరిపోయి లాభాలు వస్తాయి. వీరి  కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories