ఈ రాశివారు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్... కానీ..!

First Published Nov 27, 2021, 2:53 PM IST

ఏ ఒక్కరూ పూర్తిగా మంచివారిలా ఉండలేరు. ఏదో ఒక విషయంలో వారిలోనూ చెడు ఉండనే ఉంటుంది. అయితే.. దానిలో ఏది ఎక్కువ ఉంటే.. అది వారి వ్యక్తిత్వంగా పరిగణిస్తారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్క రాశిలో ఉన్న మంచి ఏంటో.. చెడు ఏంటో.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రతి ఒక్కరిలో మంచి ఉన్నట్లే చెడు కూడా ఉంటుంది. ఏ ఒక్కరూ పూర్తిగా మంచివారిలా ఉండలేరు. ఏదో ఒక విషయంలో వారిలోనూ చెడు ఉండనే ఉంటుంది. అయితే.. దానిలో ఏది ఎక్కువ ఉంటే.. అది వారి వ్యక్తిత్వంగా పరిగణిస్తారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్క రాశిలో ఉన్న మంచి ఏంటో.. చెడు ఏంటో.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మేష రాశి..
ఈ రాశి వారి గొప్పదనం ఏమిటంటే వారు తమ జీవితం పట్ల చాలా ఆశాజనకంగా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం భరించలేం.  పక్కన ఉంది ఎవరు అని కూడా చూడరు. బాంబు పేలినట్లే పేలిపోతారు. వీరు ఎంత మంచివారైనా ఆ కోపం వారిని కిందకు లాగేస్తూ ఉంటుంది. 

వృషభ రాశి..
ఈ రాశివారికి విధేయత చాలా ఎక్కువ. ఇలాంటి విధేయత కలిగిన వ్యక్తిని మీరు మళ్లీ కనుగొనలేరు కూడా. తమకు ఇష్టమైన వారి కోసం ఏదైనా చేస్తారు. అయితే... వీరు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈ విషయం ఇతరులకు పెద్దగా నచ్చదు.

మిథున రాశి..
ఈ రాశివారు.. కొత్త వారితో అయినా సరే ఇట్టే కలిసిపోతారు. వీరికి స్నేహితులు  చాలా ఎక్కువగా ఉంటారు. అందరితోనూ ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. వీరిని ఎవరైనా ఇట్టే ఇష్టపడతారు. అయితే.. ఈ రాశివారు అందరికీ కబుర్లు చెబుతారు. కాబట్టి.. వీరిని అందరూ అసహ్యించుకునే అవకాశం ఉంది.

కర్కాటక రాశి..
ఈ రాశివారిలో కేరింగ్ నేచర్ ఎక్కువ. తమ వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.అయితే.. వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్. ఒక్కోసారి చాలా సున్నితంగా ప్రవర్తిస్తారు. ఈ సున్నితత్వం అందరికీ నచ్చదు.

సింహ రాశి..
ఈ రాశివారు చాలా దయగా ఉంటారు. అంతే ఉదారంగా కూడా ఉంటారు. కష్ట సమయాల్లో స్నేహితులు అండగా నిలుస్తారు. కానీ.. అప్పుడప్పుడు.. వీరు ఉద్రేకంగా ప్రవర్తిస్తారు. ఇది ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

కన్య రాశి..

ఈ రాశివారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్.  ఏదైనా చేయగలరు. వీరు చాలా కష్టపడతారు. కానీ.. తరచూ తమను తాము విమర్శించుకుంటూ ఉంటారు. ఏది జరిగినా తమదే తప్పు అన్నట్లుగా ప్రవర్తిస్తారు వీరిలో అభద్రతా భావం ఎవరికీ నచ్చదు.

తుల రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీరికంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు ఉంటాయి. అయితే.. అడిగిన వారీకీ. అడగని వారికి కూడా సలహాలు ఇస్తూ.. ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు.

వృశ్చిక రాశి..
ఈ రాశివారు జీవితాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. తమ జీవితాన్ని ఆదర్శంగా చూపిస్తూ..  ఎతరులపై ప్రభావాన్ని సృష్టించగలరు. కానీ.. ఒక్కోసారి వారి మానసిక స్థితి సరిగా ఉండదు. అదే వారి పెద్ద సమస్యగా మారుతుంది.

ధనస్సు రాశి..
ధనుస్సు రాశివారు జీవితాన్ని చాలా సాహసోపేతంగా తీసుకుంటారు . ఇదే వారిని మిగిలిన వారి నుండి వేరు చేస్తుంది. కానీ పాపం, వారు భావోద్వేగాలను, రిలేషన్స్ ని సరిగా మేనేజ్ చేయలేరు.

మకర రాశి..

ఈ రాశివారు జీవితంలో ఎక్కువ విజయాలను చూస్తారు. చాలా శక్తి వంతులు అని కూడా చెప్పొచ్చు. స్నేహితులకు మంచి సలహాలు ఇస్తూ.. వారిని సరైన మార్గంలో ఉంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తమ కష్టార్జితంతో.. జీవితంలో ముందుకు వెళ్తుంటారు. కానీ.. వీరు అన్ని విషయాల్లోనూ కూల్ గా ఉండలేరు. 
 

కుంభ రాశి..
ఈ రాశివారితో ఉంటే.. చాలా పాజిటివ్ గా ఉంటుంది. వీరు ఎదుటివారికి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని  అందిస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి ప్రతి విషయంలో బెటర్ గా ఉండేందుకు తాపత్రయపడతారు. అయితే.. కొన్ని విషయాల్లో మొండిగా కూడా ప్రవర్తిస్తారు.

మీన రాశి..
ఈ రాశివారు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అన్ని విషయాల్లోనూ చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. వీరిని చూసి ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే. కానీ.. చాలా ఎమోషనల్. చిన్నపిల్లల్లాగా.. ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేస్తారు. 

click me!