జనవరి 2026లో అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఒకే రాశిలో అయిదుగ్రహాలు సంచరించబోతున్నాయి. అందుకే దీన్ని పంచగ్రహ యోగం అని పిలుస్తారు. వేద జ్యోతిషం చెబుతున్న ప్రకారం సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు.. ఒకేసారి మకరరాశిలో చేరబోతున్నారు. వారు పంచగ్రహ యోగాన్ని సృష్టిస్తారు. జనవరి 24న ఈ యోగం ఏర్పడుతుంది. అంతవరకు మకరరాశిలో నాలుగు గ్రహాలు ఉంటాయి. కానీ జనవరి 24న బుధుడు ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల ఈ శుభ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అధికంగా కలిసి వచ్చేలా చేస్తుంది. అందులో మూడు రాశులు ముఖ్యమైనది. ఇందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.