మీరు మెచ్చిన రంగు.. మీరేంటో చెప్పేస్తుందట..!

Published : Nov 06, 2021, 04:31 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం.. మీరు ఎంచుకునే రంగును పట్టి.. మీరేంటో సులభంగా  చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..  

PREV
16
మీరు మెచ్చిన రంగు.. మీరేంటో చెప్పేస్తుందట..!
color

ఏ  ఒక్కరి వ్యక్తిత్వం ఒకలా ఉండదు. ఎవరి ఆలోచనలు తగినట్లు.. వారి వ్యక్తిత్వం ఉంటుంది. అయితే.. మనిషి వ్యక్తిత్వాన్ని.. వారు మెచ్చే రంగుల ఆధారంగా చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మీరు ఎంచుకునే రంగును పట్టి.. మీరేంటో సులభంగా  చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

26

1.నలుపు..

ఈ రంగుని ఇష్టపడేవారు ఎక్కువగా  సిగ్గుపడుతూ ఉంటారు.  సమయం వచ్చినప్పుడు కూడా మనసులోని మాటను తొందరగా బయటపెట్టరు. ఎదైనా సమస్య వస్తే.. విసుగు చెందకుండా.. దానిని పరిష్కరించే మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. వారు తమ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు.వారి రహస్యాలు దాదాపు వారి స్నేహితులకు మాత్రమే తెలుస్తాయి. ఎవరితోనూ ఏ విషయాన్ని పెద్దగా షేర్ చేసుకోరు.

36

2.రెడ్ కలర్..
దాదాపు అందరూ రెడ్ కలర్ ని డేంజర్ గా చెబుతుంటారు. విభిన్న ఆలోచనలకు.. ఈ రెడ్ కలర్  సంకేతమట. ఈ రంగుని ఇష్టపడేవారికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయట. ఈ రంగుని ఇష్టపడేవారు ఎక్కువగా ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉ:టారట. వీరికి ఎవరైనా చాలా త్వరగా స్నేహితులైపోతారు.  అపరిచితులతో కూడా బాగా మాట్లాడతారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కలను సాకారం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తులు వీరు. విజయం సాధించే వరకు కష్టపడుతూనే ఉంటారు.

46

3.పింక్ కలర్..

పింక్ కలర్ ఇష్టపడే వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు సాధారణ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. చాలా సెన్సిటివ్ గా ఉంటారు.  వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ సమతుల్యతను కాపాడుకుంటారు. వీరు తీసుకునే నిర్ణయాలు ఉత్సాహభరితంగా ఉంటారు.

56

4.బ్లూ కలర్..
బ్లూ కలర్ ని ఇష్టపడేవారు.. చాలా మృదు స్వభావులు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీరు  చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎవరికైనా సహాయం చేసేస్తారు.  బంధువులు, స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటారు. వీరిది చాలా సున్నిత మనస్తత్వం.

66

5.ఆకుపచ్చ (గ్రీన్ కలర్)..
గ్రీన్ కలర్ ని ఇష్టపడేవారు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ఇష్టపడతారు. జీవితంలో ప్రతి దానిని ఆనందిస్తూ ఉంటారు.  ఈ రంగు ని ఇష్టపడేవారు వ్యాపారంలో బాగా స్థిరపడతారు.

click me!

Recommended Stories