Taurus Horoscope 2026: వృషభ రాశివారికి శని ఆశీస్సులు 2026లో డబ్బుకు లోటే ఉండదు..!

Published : Dec 04, 2025, 05:38 PM IST

 Taurus Horoscope 2026: కొత్త సంవత్సరంలో వృషభ రాశివారి ఆర్థిక పరిస్థితి, కెరీర్, ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. 

PREV
14
వృషభ రాశి ఆర్థిక ఫలితాలు..

2026 సంవత్సరం జోతిష్యశాస్త్రంలో చాలా ప్రత్యేకమైనది. ఆర్థికంగా వృషభ రాశివారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరమంతా మీ ఖర్చుల కంటే పొదుపు, పెట్టుబడులపై వీరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది వృషభ రాశివారి అదృష్టం పెరుగుతుంది. వీరికి శని గ్రహంతో పాటు బృహస్పతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆదాయంతో పాటు సౌకర్యాలు కూడా పెరుగుతాయి.

24
వృషభ రాశి ఆర్థిక జాతకం...

నూతన సంవత్సరం ప్రారంభం వృషభ రాశివారికి అద్భుతమైన ఫలితాలను తెస్తుంది. 2026 మొదటి ఆరు నెలల్లో మీరు ఆర్థిక పరిస్థితికి గ్రహ స్థానాలు చాలా బలంగా ఉంటాయి. ఈకాలంలో ఏవైనా పెట్టుబడుల నుంచి మీరు ఆర్థిక లాభాలను పొందవచ్చు. గురు గ్రహ ప్రభావం మీకు అలాంటి అవకాశాలను తెస్తుంది. కానీ, నాల్గవ ఇంట్లో కేతువు స్థానం మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.

ఈ సంవత్సరం మీకు కెరీర్ పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో ఉన్న పదో ఇంట్లో ఉన్న రాహువు మీ కెరీర్ ను కొత్త శిఖరాలకు తీసుకువెళతాడు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కానీ, రాహువు ప్రభావం వల్ల, మీరు పని కారణంగా చాలా కాలం పాటు ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. దీని కారణంగా, మీరు మీ కుటుంబం,ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

34
సంవత్సరం మధ్యలో...

సంవత్సరం మధ్యలో కూడా వృషభ రాశివారికి చాలా శుభ ప్రదంగా ఉంటుంది. చిన్న పెట్టుబడులకు కూడా లాభాలు ఎక్కువగా వస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నా లాభదాయకంగా ఉంటుంది. అయితే... సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండటమే మంచిది.

44
సంవత్సరం చివరలో...

సంవత్సరాంతము వృషభ రాశి వారికి ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. అక్టోబర్ చివరిలో, బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే బృహస్పతి వృషభ రాశి నుండి నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు మీకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో, ఆస్తి, వాహనాలు, ఇళ్లను కొనుగోలు చేసే యోగం ఉంటుంది. కుటుంబ సౌకర్యాలలో గణనీయమైన మార్పులు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories