Tarot Reading: ఈ రాశి వారు కోరుకున్నది సాధించి తీరుతారు..

Published : Jul 11, 2022, 11:00 AM IST

మీరు తీసుకున్న నిర్ణంయ మొదట్లో కష్టంగా అనిపించినా.. ప్రజల మద్దతుతో, పూర్తి విశ్వాసంతో నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు చేపట్టిన ఏ పనిలోనైనా మంచి పురోగతిని సాధిస్తారు. 

PREV
113
Tarot Reading: ఈ రాశి వారు కోరుకున్నది సాధించి తీరుతారు..
Tarot reading

ఈ టారో రీడింగ్ ని మనకు ప్రముఖ జోతిష్యులు చిరాగ్ దారువాలా అందించారు. ఈ టారో రీడింగ్ లో ఆయనకు దాదాపు 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
 

213
Aries Zodiac

మేషం: మనసులో తలెత్తే సందిగ్ధతను అధిగమించడానికి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. మీ ప్రయత్నాల దిశను మారుస్తారు. మనశ్శాంతి, సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తారు. మీ విధి పట్ల మీకు విశ్వాసం పెరుగుతుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. వాటిని స్వీకరిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా మెరుగుపడటానికి పని సంబంధిత మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తారు. ప్రకృతి ప్రతికూల అంశాలపై పని చేయడం వల్ల సంబంధంలో నమ్మకం ఏర్పడుతుంది. బరువును నియంత్రించేటప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
శుభకరమైన రంగు: నారింజ
శుభ సంఖ్య: 2

313
Taurus Zodiac

వృషభం:  ప్రజల నుంచి మీకు లభించే అభినందనలు మీ విశ్వాసాన్ని పెంచుతాయి. రిస్క్ తీసుకోవడం వల్ల గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుత కాలంలో మీరు మీ ఆనందంపై దృష్టి పెట్టాలి. సాధించలేనిది సాధించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. యువకులు లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలగా ఉండాలి. భవిష్యత్తు గురించి చింతిస్తూ ప్రస్తుత పనిని చెడగొట్టొద్దు. మీ రిలేషన్ షిప్ కు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అసిడిటీ వల్ల కడుపులో మంట వస్తుంది.
శుభ వర్ణం: - నీలం
శుభ సంఖ్య: 1

413
Gemini Zodiac

మిథునం: - మీరు కోరుకున్నది సాధించిన తర్వాత కూడా మీరు దాని గురించే ఆలోచిస్తారు. నేను సాధించలేకపోయాననే చింతిస్తూ ఉంటారు. మీరు ఆచరణాత్మకంగా ఉంటారు. దీనివల్ల మీరు కోరుకున్నది సాధించి తీరుతారు. వృత్తి సంబంధమైన చికాకులు ఎదురవుతాయి. పరిస్థితిని మార్చడానికి కొంత సమయం పడుతుంది. వివాహ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీరు మీ ఎదుటి వ్యక్తి పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం. తగినంత నిద్ర పొందడానికి ప్రయత్నించండి.
శుభ వర్ణం: - పసుపు
శుభ సంఖ్య: 6

513
Cancer Zodiac

కర్కాటకం:  మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి మీరు పూర్తిగా సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు తీసుకున్న నిర్ణయ ఫలితాలను వెంటనే చూస్తారు. కష్టాలు ఎదురైనప్పుడు పారిపోకండి. కెరీర్ విషయంలో తీసుకున్ననిర్ణయాలను అమలు చేయడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ మీ భాగస్వామి ప్రవర్తన మారదు. దీంతో మీకు మీ సంబంధంపై ఆశలు పోతాయి. ఉదాసీనత, ప్రతికూల ఆలోచనలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
శుభ వర్ణం: - తెలుపు
శుభ సంఖ్య: 4

613
Leo Zodiac


సింహం:  పాత మిత్రులతో మాట్లాడటం వల్ల మీరేం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటారు. ప్రస్తుతం ఆస్తిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరితోనైనా వ్యవహరించేటప్పుడు ప్రతి విషయాన్ని సరిగ్గా తెలుసుకోవడం ముఖ్యం. ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో నిమగ్నమైన వ్యక్తులు పరిచయస్తుల నుంచి పెద్ద కాంట్రాక్ట్ ను పొందుతారు. భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని వల్ల ఒకరికొకరు సన్నిహితంగా, ప్రేమగా ఉంటారు. శారీరక బలహీనతను తొలగించడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరం.
శుభ రంగు: ఎరుపు
శుభ సంఖ్య: 3

713
Virgo Zodiac

కన్య:  కుటుంబానికి ఇష్టమైన వారితో గడపడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యుడు తీసుకున్న నిర్ణయం కారణంగా మీరు మొదట్లో మానసిక క్షోభకు గురవుతారు. కానీ మీరు అతనివైపు నుంచి అర్థం చేసుకోవడం మొదలు పెట్టాకా.. వారికే మద్దతునిస్తారు. వర్తమానాన్ని భవిష్యత్తు అంచనాలతో సమతుల్యం చేసుకోవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. కుటుంబ సభ్యులకు, మీకు మధ్యనున్న విభేదాలు తొలగిపోతాయి. ఇది వివాహానికి సంబంధించి త్వరిత నిర్ణయానికి దారి తీస్తుంది. మీ జీవనశైలిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
శుభ రంగు: గులాబీ
శుభ సంఖ్య: 8

813
Libra Zodiac

తుల:  సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ..పనికిరాని విషయాలలో మీరు జోక్యం చేసుకోవడం వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతారు. తక్కువ శ్రమ కారణంగా మీ ఆర్థిక ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది. భావోద్వేగాల ప్రవాహంలో మీరు ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపపడతారు. మీ పొరపాటు కారణంగా పనిని కోల్పోవచ్చు. భాగస్వామి తన స్వంత విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీ మధ్య కొంత దూరాన్ని పెంచుతుంది. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు.
శుభకరమైన రంగు: నారింజ
శుభ సంఖ్య: 4

913
Scorpio

వృశ్చికం: - చాలా కాలంగా మీరు పడుతున్న ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు.  మీ ఆలోచనల్లో మార్పు రావడంతో మీరు రిస్క్ తీసుకొని ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. మారని విషయాల గురించి పట్టించుకోవడం మానేయండి. మనసులో భయం మొదలవుతుంది.  మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీ భాగస్వామి మీకు మానసికంగా మాత్రమే మద్దతు ఇస్తారు.  మీ రక్తంలో షుగర్ లెవెల్స్ చాలా తక్కువయ్యే అవకాశం ఉంది. 
శుభ వర్ణం: - నీలం
శుభ సంఖ్య: 3

1013
Sagittarius Zodiac

ధనుస్సు: - మీ సమస్యను ఇతరులతో చెప్పడం వల్ల ఎన్నో సలహాలను పొందుతారు. కానీ ఇవి మీ గందరగోళాన్ని మరింత పెంచుతాయి. ఏ పని అయినా చట్టపరిధిలోనే చేయాల్సి ఉంటుంది. మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. పని నాణ్యతపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఒక వ్యక్తి జోక్యం వల్ల భాగస్వాముల మధ్య గొడవలు జరుగుతాయి. శుభ రంగు: బూడిద
శుభ సంఖ్య: 9

1113
Capricorn Zodiac

మకరం: -  పరిస్థితులను చక్కబెట్టుకునే అవకాశం మీకు ఉన్నప్పటికీ మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. మీ ఆలోచనకు, మీ సమర్థతకు మధ్య చాలా అంతరం ఉంటుంది. అలా ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నత విద్య కోసం తమ ప్రయత్నాలను మరింత పెంచుకోవాలి. ఉన్నత విద్య కొత్త ఉద్యోగావకాశాలకు దారి తీస్తుంది. సంబంధంలో మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు కాలక్రమేణా తొలగిపోతాయి. శరీరంలో నీటి పరిమాణం తగ్గుతుంది. 
శుభ వర్ణం: - తెలుపు
శుభ సంఖ్య: 2

1213
Aquarius

కుంభం: - ప్రతికూల పరిస్థితుల కారణంగా మీపై మీరు నియంత్రణ కోల్పోతారు. మీకున్న విలువల ప్రకారం.. మీరనుకున్న ప్రకారం.. పనులు జరగవు. మీ సామర్థ్యాన్ని పెంచుకునే సమయం ఆసన్నమైంది. దీని వల్లే మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మీరు మీ పనిలో నైపుణ్యం కలిగి ఉంటారు. మీ పని సామర్థ్యాన్ని ఇతరులు కూడా మెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. కంటిలో మంట, కంటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. 
శుభ రంగు: ఆకుపచ్చ
శుభ సంఖ్య: 5

1313
Pisces Zodiac

మీనం:  మీరు తీసుకున్న నిర్ణయం మొదట్లో కష్టంగా అనిపించినా.. ప్రజల మద్దతుతో, పూర్తి విశ్వాసంతో దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు చేపట్టిన ఏ పనిలోనైనా మంచి పురోగతిని సాధిస్తారు. అసంపూర్తిగా ఉన్న వ్యాపారం లాభాల బాటలో ప్రయాణిస్తుంది. పాత రుణం నుంచి ఉపశమనం పొందుతారు. మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులకు శుభం కలుగుతుంది. బహిరంగంగా మాట్లాడటం వల్ల రిలేషన్ షిప్ లో ఉండే అపార్థాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో నొప్పి ఉండవచ్చు.
శుభ వర్ణం: - ఊదా
శుభ సంఖ్య: 7

Read more Photos on
click me!

Recommended Stories