Love Horoscope: రాశి వారు తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంది..!

Published : Jul 11, 2022, 09:00 AM IST

ప్రేమ.. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ అత్యంత ప్రాముఖ్యమైనది. అది లేకపోతే జంటల మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రేమైక జీవితాన్ని సాధించాలంటే కొన్ని ఒడిదుడుకులు, సర్దుబాట్లు తప్పనిసరి. ఈ వారం మీ ప్రేమ జీవితం ఎలా ఉందో.. జ్యోతిష్యుడు చిరాగ్ దారువాలా ఇలా చెబుతున్నారు.    

PREV
112
Love Horoscope: రాశి వారు తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంది..!

మేషం: ఈ రాశి ప్రేమికులకు ఈ వారం బాగుంటుంది. శుభ గ్రహ స్థానంగా మీ ప్రేమ జీవితంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ వారం మీ ప్రేమ జీవితానికి అనువైన పరిస్థితి ఉంటుంది. పెళ్లయిన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ వారం ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటారు. ఆ తర్వాత మీ బంధంలో కొత్తదనం కనిపిస్తుంది. అలాగే ఆఫీసు పనుల మీద బయట గడపడం వల్ల ఇంట్లో ఎక్కువ సమయం గడపరు. 

212

వృషభం: ఈ వారం మీకు, మీ ప్రియమైన వారికి మధ్య సంబంధం మెరుగుపడుతుంది. మీ మధ్యనున్న అన్ని సమస్యలు ఈ వారంలో తొలగిపోతాయి. ఇది మీ ప్రేమికుడితో ఎక్కువ సమయాన్ని గడపడానికి కూడా అవకాశం కలిగిస్తుంది. ఈ వారం వైవాహిక జీవితంలో ప్రతిదీ సజావుగా సాగుతుంది. దీంతో మీరు ఉల్లాసంగా ఉంటారు. ఇందుకోసం మీరు సోషల్ మీడియా నుంచి వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని జోకులను మీ భాగస్వామికి పంపొచ్చు. 

312

మిథునం: ఈ వారం మీ ప్రేమికుడు మీ నుంచి ఏ విషయం గురుంచైనా సలహా తీసుకుంటారు. కానీ ఆ సలహా అతన్ని సంతృప్తి పరచదు. మీ ప్రేమ బంధంపై ఈ వారం ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో మీ భాగస్వామికి మీకు మాటలుండవు. మీ భాగస్వామి మీ గురించి ఆలోచించడం మానేస్తాడు. ఇలాంటి సమయంలో మీరు వారికి ఎప్పటికప్పుడు కొన్ని బహుమతులు ఇస్తూ.. వారిని సంతోషపెట్టండి.

412

కర్కాటక : శృంగార కోణం నుంచి మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఎందుకంటే మీ ప్రేమికుడు మీ నుంచి ఏదైనా పెద్ద వాగ్దానాన్ని తీసుకోవడానికి లేదా ఆశించే అవకాశం ఉంది. దాని గురించి మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా.. కొంత సమయం అడగండి. అటువంటి పరిస్థితిలో మీరు గందరగోళానికి గురై మీ ప్రేమికుడిని కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఈ వారంలో మీ జీవిత భాగస్వామి పుట్టినరోజు లేదా మీ వార్షికోత్సవం వంటి ముఖ్యమైన రోజుని మర్చిపోవచ్చు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు వారికి అందమైన బహుమతిని లేదా సర్ ప్రైజ్ చేయడం వల్ల అన్ని విభేధాలు తొలగిపోయి ఇద్దరు సంతోషంగా ఉంటారు. 

512

సింహం: మీ బాయ్‌ఫ్రెండ్‌తో 'డేట్'కి వెళుతున్నట్టైతే.. ఆ సమయంలో మీరు ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇది మీ భాగస్వామిని బాధిస్తుంది. ముఖ్యంగా ఇది మీ ఇద్దరి మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవడం మరచిపోయే అవకాశం ఉంది. ఈ విషయాలు ఇతర కుటుంబ సభ్యులకు లేదా సన్నిహితులకు తెలుస్తాయి. మీరు ఆ విషయాలను వారి నుంచి దాచాలనుకుంటున్నావని మీ భాగస్వామి భావించే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమైన విషయాలను మర్చిపోకుండా మీ భాగస్వామికి అన్నీ చెప్పండి. 

612

కన్య: ఈ వారం మీరు మీ భాగస్వామిని హృదయపూర్వకంగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. మూడో వ్యక్తి కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం వచ్చి ఉంటే ఈ సమయంలో అది దూరం అవుతుంది.  ప్రేమ కారు మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది. దీంతో మళ్లీ మీరు ప్రేమలో విహారిస్తారు. వివాహితుల లైఫ్ లో ఇంటికి బంధువు రాకతో ఆనందం వెల్లివిరుస్తుంది. దీనివల్ల ఇంటి వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది.

712

తుల: ఇప్పటి వరకు మీ జీవితంతో నిజమైన ప్రేమను చూడకపోతే.. ఈ వారం దాన్ని చూస్తారు. ఈ వారం మీ వైవాహిక జీవితంలో కొంత విసుగు ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కాలక్రమేణా ప్రతి సంబంధం పాతదైపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ బోరింగ్ వైవాహిక జీవితాన్ని ఉత్సాహంగా మార్చడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీ వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది. 

812

వృశ్చికం: ఈ వారం మీరెంత ప్రయత్నించినా మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రియమైన వ్యక్తికి మీ పరిస్థితులను లేదా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలను వివరించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ వారికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అవసరమైతే మీ భాగస్వామిని అందమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లండి. వారితో మళ్లీ కమ్యూనికేట్  అవడానికి ప్రయత్నించండి. వారం ప్రారంభంలో మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటి పెద్దలు మీ మధ్య వివాదాలను పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఒకరినొకరు క్షమాపనలు చెప్పుకుని ఒక్కటైపోతారు. 

912

ధనుస్సు: ఈ వారం మీకు మీ లవర్ కు మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.  దీని కోసం మీ పని నుంచి కొంత సమయాన్ని వెచ్చించండి. మీ ప్రేమికుడితో గడపండి. సంబంధంలో ఉన్న ప్రతి అపార్థాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఈ వారం మీ జీవిత భాగస్వామికి, మీ తల్లికి మధ్యనున్న వివాదాలన్నీ పోతాయి. దీంతో మీ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఇది మీ వైవాహిక జీవితాన్ని సానుకూల మార్గంలో నడిపిస్తుంది. 

1012

మకరం: ఈ వారం ప్రేమలో పడే ఈ రాశి వారు తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ హృదయాన్ని పంచుకోవడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఈ కారణంగా మీరు బాగా పని చేయగలుగుతారు. ఈ వారం వైవాహిక జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజులలో ఒకటిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోతారు. దాని ఫలితంగా మీరు అతనిపై ప్రేమ, ఆప్యాయతలను కురిపిస్తారు. మీ ప్రతి అడుగు అతనికి మద్దతుగా ఉంటుంది. 

1112

కుంభం: ఈ వారం మీకు మీ భాగస్వామికి మధ్య ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఎప్పటిలాగే ఈ సమయంలో కూడా  మీరు మీ భాగస్వామికి పాఠాలు చెప్పడం, వారిని తిట్టడం వంటివి చేస్తారు. దీనివల్ల మీ ప్రేమికుడు అకస్మాత్తుగా కోపం తెచ్చుకుంటారు. అనుకోకుండా మిమ్మల్ని అవమానపరిచే  మాటలు అనొచ్చు. ఈ రాశివారి వివాహితుల జీవితంలో ఈ వారం శృంగారం, ప్రేమ లాంటివి ఉండవు.  అయితే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తప్పవని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ మీరిద్దరూ ఒకరినొకరు లేకుండా జీవించలేరన్నది  నిజం. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సమస్యను పెద్దదిగా చేసి చూడకండి. 

1212

మీనం: ప్రేమ జీవితంలో ఒకరికొకరు తమ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఇది మంచి సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీ భాగస్వామి మీ ముందు తన మనసులోని మాటను చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది పడడు. దీంతో మీరు అతని జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకునే అవకాశం పొందుతారు. పెళ్లయిన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ వారం ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు. దీంతో మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories