Sun Transit: ధనుస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 5 రాశులకు ఇక అన్నీ మంచి రోజులే!

Published : Dec 16, 2025, 02:44 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రస్తుతం వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి విపరీతమైన అదృష్టాన్ని మోసుకురానుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా…   

PREV
16
సూర్యుడి రాశిమార్పు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్ణీత సమయంలో గ్రహాలు.. రాశులను మారుస్తుంటాయి. నేడు (డిసెంబర్ 16- మంగళవారం) సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశులవారికి కొత్త అవకాశాలు, ఆర్థిక వృద్ధి, సామాజిక గుర్తింపు దక్కనుంది. మరి ఆ రాశులేంటో.. వారి జీవితాల్లో ఇంకా ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
మేష రాశి

మేష రాశి వారికి సూర్య సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. కొత్త ఇల్లు, ఫ్లాట్ లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. 

36
సింహ రాశి

సింహ రాశివారికి సంపద పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అనుకున్న స్థాయిలో రాణిస్తాయి. మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో టీమ్‌వర్క్ మంచి ఫలితాలను ఇస్తుంది. తోటి ఉద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో మీ కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ భాగస్వామి సహాయంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు.

46
తుల రాశి

తుల రాశివారికి సూర్య సంచారం అదృష్టాన్ని మోసుకువస్తుంది. వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందే అవకాశం ఉంది. మీ ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి. పనితీరు మెరుగుపడుతుంది. స్నేహితుల మద్ధతు లభిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి శుభవార్తలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

56
ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారికి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని విషయాల్లో సహనం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. 

66
మకర రాశి

మకర రాశివారికి సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. పై అధికారులతో సఖ్యత పెరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాతో ముందుకు సాగడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories