Sun Transit: 4 రోజులు ఆగితే చాలు.. ఈ 6 రాశుల పంట పండినట్లే!

Published : May 09, 2025, 03:38 PM ISTUpdated : May 09, 2025, 04:26 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. దానివల్ల అన్ని రాశులపై మంచి, చెడు ప్రభావాలుంటాయి. త్వరలో సూర్యుడు.. వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీనివల్ల 6 రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, ఆస్తి పరంగా శుభ ఫలితాలున్నాయి. మరి ఆ రాశులెంటో చూద్దామా...

PREV
17
Sun Transit: 4 రోజులు ఆగితే చాలు.. ఈ 6 రాశుల పంట పండినట్లే!

మే 14 నుం జూన్ 14 వరకు గ్రహాలకు అధిపతి.. విజయానికి, సాధనలకు కారకుడైన సూర్యుడి సంచారం వృషభ రాశిలో ఉంటుంది. సహజ సంపదకు పెట్టింది పేరైన వృషభ రాశిలో సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారు డబ్బు, అధికారం పొందే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఏ రాశివారికి సూర్యుడు అదృష్టాన్ని మోసుకువస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.

27
మేష రాశి

మేష రాశి వారికి ఐదవ అధిపతి అయిన రవి అత్యంత శుభ స్థానమైన ధన స్థానంలో సంచరించడం వల్ల అన్ని ఆర్థిక ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, పూర్వీకుల నుంచి ధనం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం అధికంగా వస్తుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది.

37
వృషభ రాశి

వృషభ రాశిలోనే రవి సంచారం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి ఖాయం. స్వల్ప ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. సొంత ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు స్వస్థలంలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.

47
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి లాభ స్థానంలో సూర్య సంచారం ఉండటం వల్ల రాజకీయ నాయకులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆస్తులు చేతికి వస్తాయి. తండ్రి తరఫు ఆస్తి లభించే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం, ఆనందం నెలకొంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

57
సింహ రాశి

సింహ రాశి అధిపతి అయిన రవి పదవ స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది. ఒక సంస్థకు ఉన్నతాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తండ్రి నుంచి సహకారం లభిస్తుంది. ఆస్తులు చేతికి వస్తాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

67
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి సూర్యుడు ఏడవ స్థానంలో సంచరించడం వల్ల ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. రాజకీయంగా పలుకుబడి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులకు ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు స్వస్థలంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక లాభం చేకూరుతుంది. మంచి సంబంధాలు కుదురుతాయి. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తితో వివాహం అయ్యే అవకాశం ఉంది.

77
కుంభ రాశి

కుంభం రాశి వారికి నాల్గవ స్థానంలో సూర్య సంచారం ఉండటం వల్ల ఇల్లు, వాహన యోగం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆస్తి కొనుగోలు చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories