Sun Transit: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం

Published : May 03, 2026, 06:19 AM IST

Sun Transit: జ్యోతిష్య శాస్త్రంలో రోహిణి నక్షత్రాన్ని ఎంతో శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు.  అదృష్టాన్ని తెచ్చేదిగా భావిస్తారు. ఈ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల 3 రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆర్ధికంగా కలిసి వస్తుంది.

PREV
14
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు

గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడు చేసే సంచారం 12 రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మే నెలలో గ్రహాలకు సూర్యుడు ముఖ్యమైన సంచారం చేయబోతున్నాడు. మే 11న సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. రోహిణి నక్షత్రం చంద్రుడికి ఎంతో ఇష్టమైనది.  జ్యోతిషశాస్త్రంలో రోహిణి నక్షత్రాన్ని శుభానికి చిహ్నంగా చెప్పుకుంటారు. ఈ సంచారం వల్ల మూడు రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం పట్టనుంది.

24
వృషభ రాశి

రోహిణి నక్షత్రం వృషభ రాశి వారికి చెందింది. కాబట్టి మే నెలలో జరగబోయే సూర్య సంచారం ఈ రాశి వారికి బాగా కలిసివస్తుంది. ఇది ఫలవంతమైన మార్పు. ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుకుతారు. దీంతో పాటు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు. 

34
సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి సూర్య సంచారం వీరికి కలిసి వస్తుంది.  సూర్యుడు రోహిణి వంటి శుభ నక్షత్రంలోకి అడుగుపెట్టినప్పుడు  ఈ రాశి వారికి కెరీర్‌ దూసుకుపోతుంది. ఈ రాశి వారు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఇదే సరైన సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  ఈ రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది.

44
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి సూర్యుడి సంచారం మంచి సౌకర్యాన్ని, విలాసాన్ని అందిస్తుంది.  ఇతరుల చేతిలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఈ సమయం ఆర్థికంగా విజయాన్ని తెస్తుంది. భవిష్యత్తు కోసం తగినంత డబ్బును కూడబెట్టుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories