1. వృశ్చిక రాశి
మీరు ఎప్పుడైనా వృశ్చిక రాశిని దగ్గరగా గమనించినట్లయితే, మీరు వారి తీవ్రమైన మానసిక స్థితిని గమనించి ఉండవచ్చు. నిబద్ధతకు ఈ రాశివారు మరో పేరు. తమను ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా అంటే ఈ రాశివారు మనసులోనే పెట్టేసుకుంటారు. పగ సాధించడంలో కూడా ముందుంటారు. ఒకసారి మీరు ఏదైనా తప్పు చేస్తే, వృశ్చిక రాశి వారు దానిని మర్చిపోరు, మిమ్మల్ని క్షమించరు కూడా. వారు మీకు దూరంగా ఉంటారు. మీపై ప్రతీకారం తీర్చుకోకపోయినా, మీ తప్పును మాత్రం క్షమించరు.