Today Horoscope: ఓ రాశివారు చేపట్టిన పనులలో ఇబ్బంది,ఓర్పు అవసరం

First Published Nov 16, 2023, 4:59 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త అవసరము.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఓం శాంభవాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

16-11-2023,  గురువారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
             
పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :-  16 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్ల పక్షం 
గురువారం
తిథి :- తదియ ప12.53 ని॥వరకు
నక్షత్రం :-  మూల తె.3.26 ని॥వరకు
యోగం:- సుకర్మము ఉ॥11.48 ని॥వరకు
కరణం:- గరజి ప॥12.53 వణిజి రాత్రి  12.12 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 9.11 ని॥ల 10.45 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:52 ని॥ల ఉ॥ 10.37 ని॥వరకు  తిరిగి మ॥ 2:21 ని॥ల మ॥ 03.06 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥11.50 ని॥ల 1.24 ని॥వరకు రాత్రి 1.54 ని॥ల 3.26 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  05:4 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.29ని॥లకు

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మ తార)
భరణి నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం విషయాలు అనుకూలిస్తాయి.ఓం భార్గవాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)
రోహిణి నక్షత్రం వారికి  (నైధన తార)
మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-చేయు పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు పెరుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు రాగలవు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త అవసరము.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఓం శాంభవాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి(సాధన తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-అనవసరమైన ఆలోచనలు కలుగుతాయి. పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది.  పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.కోర్టు వ్యవహారంలో నిరాశ. చేపట్టిన పనులు పూర్తికాక అసహనానికి గురి అవుతారు.
మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తీసుకోవాలి. ఓం శివాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)
పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. పనులు పట్టుదలతో చేయాలి. బంధు మిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన కార్య ప్రయాత్నాలు ఫలిస్తాయి.మాటలతో అందరిని ఆకట్టుకుంటారు.రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగాలలో సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మ తార)
పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో పై అధికారుల తో చికాకులు తప్పవు.శారీరక శ్రమ ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. మిత్రులతో మనస్పర్ధలు రాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి.ఓం సదాశివాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)
హస్త నక్షత్రం వారికి (నైధన తార)
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-తలచిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మానసికమైన ఆనందం కలుగుతుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం.ఓంశశిధరాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)
స్వాతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
విశాఖ  నక్షత్రం వారికి  (క్షేమతార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఓం బృహస్పతియే నమః  అని  జపించండి. శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (క్షేమ తార)
అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సంపత్తార)

దిన ఫలం:-ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు .కీలకమైన సమస్యలను బుద్ధి బలంతో పరిష్కరిస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వాదోపవాదములకు దూరంగా ఉండాలి.ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి  (జన్మ తార)
పూ.షా నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం కుమారాయ నమః అని జపించండి. శుభ ఫలితాలు పొందండి

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)
శ్రవణం నక్షత్రం వారికి  (నైధన తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు .కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఓం ఆదిత్యాయనమః  అని జపించండి .శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి (సాధన తార)
శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.భా నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-పనులలో  ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.వాహన ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.బంధు మిత్రులతో  వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. ఓం నమో భగవతే రాహువే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (క్షేమ తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (విపత్తార)
రేవతి నక్షత్రం  వారికి  (సంపత్తార)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. జీవిత భాగస్వామి తో అనుకోని మనస్పర్ధలు.వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.విందు వినోదాలలో పాల్గొంటారు.కీలకమైన సమస్యలలో బుద్ధి చాతర్యము చూపిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి

click me!