astrology
బృహస్పతి మీన రాశికి అధిపతి. మీన రాశి వాళ్లకు సమాజిక సరిహద్దులు ఎక్కువగా ఉంటాయి. వీళ్ల ఆలోచన ఎప్పుడూ వాళ్ల మీదకంటే పేదలపైనే ఎక్కువగా ఉంటుంది. పేదలకు దానం చేయడంలో ఈ రాశివారు ఎప్పుడూ వెనకాడరు. ఈ రాశి వాళ్లు ఎంతో ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ స్వభావం వల్లే వీరిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మీనరాశి వాళ్లు ఎలాంటి వారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్ట టైం, తేదీ, ప్రదేశంలో జన్మిస్తారు. తదనుగుణంగా వాళ్ల స్వభావం, ప్రవర్తన నిర్ణయించబడుతుంది. ఇది ఒక వ్యక్తి స్వభావాన్ని మాత్రమే కాకుండా వారి మంచి, చెడు అలవాట్లను కూడా నిర్ణయిస్తుంది. మీన రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అన్నిటికంటే ఉత్తమం
మీనరాశి వారు ప్రతి విషయంలోనూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. అలాగే ఇతరుల ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ మీన రాశి వారి ఆలోచన మొదలవుతుంది. కానీ వేరే రాశివారైతే ఇలా చేయరు. మీన రాశి వారికి ప్రతి సమస్య నుంచి బయటపడే మార్గం ఉంటుంది. అలాగే ఇతరులు కూడా ఆలోచించని పరిష్కార మార్గాల గురించి వీరు ఆలోచిస్తారు. ఎలాంటి బోరింగ్ విషయమైనా క్యూరియాసిటీగా మార్చేస్తారు. వీళ్ల నుంచి ఇది బాగా నేర్చుకోవచ్చు.
Astro
ప్రయాణాలు ఇష్టం
మీన రాశి ఆడవాళ్లకు ప్రయాణాలంటే చాలా చాలా ఇష్టం. వీళ్లు ఎంత అలసిపోయినప్పటికీ.. వీళ్లు జర్నీని బాగా ఇష్టపడతారు. ఈ రాశి మహిళలు చాలా తెలివైనవారు. అందుకే వీళ్లు అంత సులువుగా మోసపోలేరు.
Pisces Zodiac
ప్రేమలో బిడియం
మీన రాశి వాళ్లకు ప్రేమలో బాగా సిగ్గుపడతారు. అంతేకాదు వీళ్లు చాలా రొమాంటిక్ కూడా. ఈ వ్యక్తులు తమ భాగస్వామికి పూర్తి ప్రేమ, సంరక్షణ ఇస్తారు. ప్రేమలో ప్రతిదీ త్యాగం చేసే ఈ వైఖరి కొన్నిసార్లు వారికి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే వీళ్లు ప్రేమలో మోసపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ రాశి మహిళలు మీరు చెప్పకుండానే మీ ఫీలింగ్స్ ను అర్థం చేసుకుంటారు.
Pisces Zodiac
మీన రాశి జంట
మీన రాశి అమ్మాయిలకు కర్కాటక రాశి అబ్బాయిలు సరైన జోడీ. ఎందుకంటే ఈ రెండు రాశుల వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఈ రాశి వారు తొందరగా ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకుంటారు. అలాగే ఈ జంట చాలా మంచివారు కూడా. వీళ్లు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే ఒకరికొకరు పర్ఫెక్ట్ గా కూడా ఉంటారు. ఈ రాశి వారు చెడు పనిని లేదా చెడు పదాలను ఏ విధంగానూ ఇష్టపడరు.
నిజాయితీ, సున్నితత్వం
మీన రాశి ఆడవాళ్లు చాలా నిజాయితీగా, సున్నితంగా ఉంటారు. వీళ్లు ఎవ్వరినీ బాధించరు. అలాగే తమ మాటలను ఎదురుగా ఉన్నవారు తప్పుగా అర్థం చేసుకుంటారని ఎప్పుడూ భయపడుతుంటారు. వీరి గ్రహం బృహస్పతి మార్చిలో జన్మించినందున, వీరు చాలా ప్రభావవంతంగా ఉంటారు.
కష్టపడి పనిచేయడం
ఈ రాశి మహిళలు చాలా కష్టపడి పనిచేస్తారు. అలాగే పనిపట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్లు పనిలో పురోగతి సాధిస్తూనే ఉంటారు. వీరు తమ నైపుణ్యాలకు అనుగుణంగా పనిలో పురోగతి సాధిస్తారు. ఈ రాశి ఆడవాళ్లు బాగా కష్టపడి పనిచేస్తారు. అంతేకాకుండా వీరు బాగా ఖర్చుచేస్తారు కూడా. అందుకే వీరు పొదుపు చేయలేరు.
కుతూహలము
మీన రాశి స్త్రీలకు చాలా విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఆడవాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు. కానీ ఈ వ్యక్తులను నమ్మడం కష్టం ఎందుకంటే వీళ్లు ఏదీ సీక్రేట్ గా ఉంచలేరు.