త్రిగ్రాహి యోగం..
జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్న ప్రతిసారీ దాని ప్రభావం.. రాశులపై పడుతూ ఉంటుంది. మే 18వ తేదీన మిథున రాశిలో శుక్ర, గురు, చంద్రులు కలిసి త్రిగ్రహి యోగం ఏర్పరచాయి. ఈ శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. మూడు శుభ గ్రహాలు కలవడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా ఐదు రాశులకు ధన ప్రాప్తి కలగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...