శని దేవుడి పేరు వింటే చాలు అందరూ భయపడి పోతుంటారు. శని ప్రభావం పడితే సమస్యలు వస్తాయని నమ్ముతారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి 4 రాశుల వారంటే చాలా ఇష్టమట. ఈ రాశుల వారికి శని.. ఎప్పుడూ కష్టం కలిగించడట. మరి ఆ రాశులెంటో చూద్దామా..
శని దేవునికి ఇష్టమైన రాశుల్లో మొదటిది వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్యం ప్రకారం శని, శుక్రుడి మధ్య స్నేహ పూర్వక సంబంధం ఉంటుంది. అందువల్ల వృషభ రాశి వారికి శని దేవుడు శుభ ఫలితాలను ఇస్తాడు. వారికి ఎలాంటి కష్టాలను కలిగించడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
24
తుల రాశి
శని దేవునికి ఇష్టమైన రాశుల్లో తుల రాశి ఒకటి. తుల రాశిని శని దేవుని ఉచ్ఛ రాశిగా భావిస్తారు. శని దేవుడు ఈ రాశిలో ఉంటే సాధారణంగానే మంచి ఫలితాలు వస్తాయి. తుల రాశి అధిపతి శుక్రుడు. శుక్ర, శని మధ్య స్నేహ సంబంధం ఉండటం వల్ల తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
34
మకర రాశి
శని దేవుడికి ఇష్టమైన మరో రాశి మకరం. ఈ రాశి.. శని స్వక్షేత్ర రాశి. అందువల్ల శని ఈ రాశి వారిని కష్ట జీవులుగా, నిబద్ధత కలిగిన వారిగా చేస్తాడు. ఈ రాశి వారిపై శని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. శని దయతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు.
శనికి ఇష్టమైన రాశుల్లో కుంభ రాశి కూడా ఉంది. కుంభ రాశి కూడా శని స్వక్షేత్ర రాశి. కుంభ రాశిని శని మూలత్రికోణ రాశిగా కూడా పరిగణిస్తారు. ఈ రాశి వారు శని దేవుడి దయతో శుభ ఫలితాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఈ రాశి వారికి డబ్బు కొరత ఉండదు. చేపట్టిన పనుల్లో విజయాలు అందుకుంటారు.