మిథున రాశి వారికి శని సానుకూల ఫలితాలను అందివ్వబోతున్నాడు. వీరి జాతకంలో వృత్తి స్థానంపై శని దృష్టి ఉంటుంది. దీని వల్ల వీరి ఉద్యోగం, పనిలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీ పని నచ్చిన పై అధికారులు మీకు జీతం పెంపు లేదా ప్రమోషన్ గురించి చర్చించే అవకాశం ఉంది. ఇక కుటుంబంలో ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక పరిశోధన, విద్యారంగంలోని వారికి ఈ కాలం బాగా కలిసివస్తుంది.