Shani Amavasya: 13 ఏళ్ల తర్వాత అరుదైన శని కలయిక... ఈ రాశుల అదృష్టం రెట్టింపు...

Published : Apr 11, 2026, 05:08 PM IST

Shani Amavasya: ఈ ఏడాది శని జయంతి మే16వ తేదీన జరుపుకోనున్నారు. అయితే ఈ శని జయంతి అమావాస్య తిథినాడు ఏర్పడుతోంది.  దీనిని శని అమావాస్య అని పిలుస్తారు 13 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుండటం విశేషం. ఈ కలయిక కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. ఆ రాశులు ఇవే 

PREV
15
1వృషభ రాశి...

శని జయంతి అమావాస్య రోజున రావడంతో ఏర్పడిన శని అమావాస్య వృషభ రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఈ సమయంలో ఈ రాశివారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఈ రాశివారి వృత్తిపరమైన జీవితంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాదు, చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో శని దేవుడి అనుగ్రహం ఈ రాశివారిపై చలా ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది.

25
2.మిథున రాశి...

శని అమావాస్య మిథున రాశి జీవితంలో కూడా అనేక సానుకూల మార్పులు తీసుకురానుంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిథున రాశివారి ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు లభిస్తాయి. ఈ రాశివారు ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఈ కాలంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత కాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతి ఫలం లభిస్తుంది. శుభ వార్తలు వింటారు. మీరు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తారు.

35
3.తుల రాశి..

శని అమావాస్య తర్వాత తుల రాశివారి జీవితం అద్భుతంగా మారనుంది. ఈ రాశివారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించగులుగుతారు. అంతేకాదు.. ఈ సమయంలో వీరు గొప్ప వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. శని దేవుని అనుగ్రహం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి పూర్తి సపోర్ట్ పొందుతారు.

45
4. ధనుస్సు రాశి...

శని అమావాస్య ధనుస్సు రాశి వారి జీవితంలో అనేక శుభ ఫలితాలను తీసుకురానుంది. ఈ సమయంలో ఈ రాశివారు అనేక శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. దీని వల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు.. తమ లక్ష్యాలను చాలా సులభంగా చేరుకుంటారు. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

55
5.కుంభ రాశి...

కుంభ రాశివారి శని అధిపతి. ఈ కాబట్టి, ఈ సమయం కుంభ రాశివారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. శని జయంతి కుంభ రాశివారి జీవితంలో అనేక మార్పులను తీసుకురానుంది. వారు చేయాలి అనుకున్న ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న శుభ వార్తలన్నీ కుంభ రాశివారు ఈ నెలలోనే వింటారు. ఈ సమయంలో ఈ రాశి గౌరవ, మర్యాదలు బాగా పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories