మీన రాశిలోకి శని ప్రవేశం.... 2027 వరకు ఈ మూడు రాశులకు అదృష్టమే..!

First Published | Aug 2, 2024, 3:51 PM IST

 కుంభ రాశి నుంచి మీన రాశి లోకి అడుగుపెట్టనుంది. 2027 వరకు ఉండనుంది. అయితే.. ఈ కాలంలో.. మూడు రాశుల వారికి చాలా మంచి జరుగనుంది. ఆ రాశుల అదృష్టమే మారిపోనుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం...
 

జోతిష్యశాస్త్రం ప్రకారం.. శనిని కర్మగా భావిస్తారు. అన్ని గ్రహాల్లోనూ.. శని గ్రహం మాత్రం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఈ శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడానికి దాదాపు  రెరండున్నర సంవత్సరాలు పడుతుందట. ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో ఉంది.  2023 జనవరిలో కుంభరాశి లోకి ప్రవేశించాడు. మళ్లీ మార్చి 29వ తేదీ 2025లో శని తన రాశిని మార్చుకోనుంది. కుంభ రాశి నుంచి మీన రాశి లోకి అడుగుపెట్టనుంది. 2027 వరకు ఉండనుంది. అయితే.. ఈ కాలంలో.. మూడు రాశుల వారికి చాలా మంచి జరుగనుంది. ఆ రాశుల అదృష్టమే మారిపోనుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం...

telugu astrology


1.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి శని సంచారం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కాలంలో.. కర్కాటక రాశివారికి ఆకస్మిక సంపద లభిస్తుంది. ఇరుక్కుపోయిన వారి డబ్బు తిరిగి వారికి మళ్లీ చేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ కాలం మొత్తం వారికి చాలా సానుకూలంగా ఉంటుంది.  పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. జీవితంలో ఎప్పుడూ లేని ఆనందం పొందుతారు.


telugu astrology

2.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి శని సంచలనం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సానుకూల కోరికలు నెరవేరుతాయి. మనస్సు మతపరమైన పనిలోనే ఉంటుంది. మీరు జీవితంలో చాలా మంచి మార్పులను చూస్తారు. కార్యాలయంలో మీ పనిని అందరూ ప్రశంసిస్తారు.. గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో మీకు అదృష్ట మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళితే ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు జీవితంలో కష్టాలను సులభంగా అధిగమిస్తారు.
 

telugu astrology

3.మకర రాశి..
మకరరాశి వారికి శని సంచారం చాలా ప్రత్యేకం. ఈ కాలంలో, మీరు తరచుగా పని కారణంగా చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. మీరు కొత్త అవకాశాన్ని పొందుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణం తీర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది. స్వాధీనం చేసుకున్న సొమ్మును రికవరీ చేసుకోగలరు. విద్యార్థులకు కూడా మంచి సమయం. ఈ కాలంలో కెరీర్‌లో విజయం ఉంటుంది. మీరు ప్రమోషన్ కూడా పొందుతారు. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి.

Latest Videos

click me!