Shani Vakri: 138 రోజుల పాటూ ఈ 5 రాశులకు కష్టాలు తప్పవు, జాగ్రత్త అవసరం

Published : Feb 01, 2026, 06:36 PM IST

Shani Vakri: శని గ్రహం వల్ల అయిదు రాశుల వారికి కష్టాలు తప్పవు. శని జూలై 13 నుంచి తిరోగమనంలో ఉంటాడు. మళ్లీ సాధారణ స్థితికి నవంబర్ 28న వస్తాడు. దీని వల్ల 138 రోజుల పాటూ కొన్ని రాశులకు ఇబ్బందులు తప్పవు 

PREV
15
మేష రాశి

మేషరాశి వారికి శని గ్రహం వల్ల 138 రోజుల పాటూ ఎన్నో బాధ్యతలు పెరగొచ్చు. వీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. పనులు సగం సగం పూర్తవుతాయి. మిగతావి పూర్తి కావడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో ఓపికగా ఉండాలి. కెరీర్ లో కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆ సమయంలో ఎంతో సహనం అవసరం.

25
సింహ రాశి

సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నామా అని తమను తాము ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. గత నిర్ణయాల గురించి పునరాలోచించుకోవాల్సి వస్తుంది. ప్రేమ సంబంధాలలో అపార్థాలు రావచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఖర్చులు తగ్గించుకోవడం చాలా అవసరం. 

35
ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి బాగా ఒత్తిడి పెరిగే రోజులు ఇవి. వీరికి పని ఒత్తిడి పెరిగిపోయి మానసిక అలసట ఎక్కువైపోతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.  చదువు, పని, ప్రయాణాలు ఇలా ప్రతి అంశంలోనూ ఆలస్యం కావచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

45
కుంభ రాశి

కుంభరాశికి అధిపతి శని.  కాబట్టి ఈ రాశి వారిపై శని ప్రభావం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఏలినాటి శని చివరి దశ సాగుతుంది. దీని వల్ల శని తిరోగమనం ప్రభావం ఈ రాశి వారిపై భారీగా పడుతుంది. వీరు చేసే పనుల్లో ఒత్తిడి పెరగొచ్చు. మీ దగ్గరి స్నేహితులతో విభేదాలు పెరిగిపోతాయి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

55
మీన రాశి

మీనరాశి వారికి ఈ 138 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ  సమయంలో కాస్త మానసిక గందరగోళం ఏర్పడుతుంది. ఎంత కష్టపడినా మంచి రాకపోవడం వల్ల నిరాశగా అనిపిస్తుంది. వీరికి కుటుంబ బాధ్యతలు పెరిగిపోతాయి. ఎంతో ఓపికగా ఉండాలి. స్థిరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories