కుంభ రాశిలోకి శని ప్రవేశం.. దీపావళి నాటికి ఈ రాశుల వారికి రాజయోగమే..!

First Published | Aug 9, 2024, 12:01 PM IST

దీపావళి పండగ తర్వాత  కుంభ రాశిలోకి శని గ్రహం అడుగుపెడుతుంది. ఈ కారణంగా... శష రాజయోగం ఏర్పడనుంది. దీని కారణంగా... కొన్ని రాశులవారికి అదృష్టం కలగనుంది. మరి.. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

Saturn

జోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. శనిని న్యాయానికి, కర్మలకు దేవుడుగా చెబుతూ ఉంటారు. మనం ఎల్లప్పుడూ న్యాయాన్ని అనుసరిస్తూ, మంచి పనులు చేసే వ్యక్తులకు శని దేవుడు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాడు. శని శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి చాలా అదృష్టం జరుగుతుంది. కానీ.. అదే అశుభ స్థానంలో ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.  అయితే... దీపావళి పండగ తర్వాత  కుంభ రాశిలోకి శని గ్రహం అడుగుపెడుతుంది. ఈ కారణంగా... శష రాజయోగం ఏర్పడనుంది. దీని కారణంగా... కొన్ని రాశులవారికి అదృష్టం కలగనుంది. మరి.. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

telugu astrology

1.మేష రాశి..

కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం కారణంగా మేష రాశివారికి చాలా శుభకాలం మొదలుకానుంది.  ఈ కాలంలో  ఈ రాశివారు సందప, ఆనందం పొందుతారు. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులకు ఇచ్చిన డబ్బు  తిరిగి  మీకు వచ్చేస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కాలంలో ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.
 


telugu astrology

2.మిథున రాశి...

కుంభ రాశిలోకి శని ప్రవేశం... మిథున రాశివారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ కాలంలో ఉద్యోగ, వ్యాపారాల్లో  ఆశించిన విజయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి.  కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. అందరితోనూ సత్ సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు కూడా  వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి.
 

telugu astrology

3.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి శని సంచారం చాలా మేలు చేస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభమవుతాయి. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశి విద్యార్థులు విద్యా పోటీలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు కార్యాలయంలో ఇచ్చిన లక్ష్యాలను చేరుకుంటారు. ఈ కాలంలో మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు.

telugu astrology

4.సింహ రాశి..
 సింహరాశికి శని సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. సింహ రాశి వారు ఈ కాలంలో చాలా మంచి మార్పులను చూస్తారు. జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అవకాశం లభిస్తుంది. ఈ కాలంలో పదోన్నతి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు.

telugu astrology

5.కన్య రాశి..
కన్యారాశికి కుంభరాశిలో శని సంచారం చాలా సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. కుటుంబ సభ్యులు ప్రతి పనిలో సహకరిస్తారు. మనస్సు మతపరమైన పనిలోనే ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడులు తొలగిపోతాయి. పిల్లలు సంతోషకరమైన వార్తలు వింటారు. ఇంటికి అతిథులు వస్తారు.

Latest Videos

click me!