వృశ్చిక రాశి వారికి ఈ కాలం వృత్తి, ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. గురుడు తొమ్మిదవ ఇంట్లో, శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం.