కూర చేసేటప్పుడు టేస్ట్ చూస్తున్నారా? ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 28, 2024, 5:14 PM IST

చాలా మంది ఆడవారు వంటలు చేసేటప్పుడు వాటిలో ఉప్పు, కారం సరిపోయాయా? లేదా? అని ఒకటికి రెండు సార్లు టేస్ట్ చూస్తుంటారు. కానీ దీనివల్ల ఏమౌతుందో తెలుసా?

నిజానికి వంట చేయడం ఒక కళే. ఎందుకంటే వంటలు టేస్టీగా రావడానికి అవసరమైన పదార్థాలను ఎంత వేయాలో అంతే వేస్తారు. టేస్టీ టేస్టీ, హెల్తీ ఆహారాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వంట చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులను చేస్తుంటారు. వాటివల్లే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

హిందూమతంలో వంట చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే వంట చేయడం, తినడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం.. ఫుడ్ ను ప్రిపేర్ చేసేటప్పుడు అస్సలు రుచి చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయితే చాలా మంది ఆడవారు వంటల్లో ఉప్పు, కారం వంటివి సరిపోయాయా? లేదా? అని టేస్ట్ చూస్తుంటారు. ఇది చాలా కామన్. కానీ జ్యోతిస్యుల ప్రకారం.. వంట చేసేటప్పుడు టేస్ట్ అస్సలు చూడకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అన్నపూర్ణ తల్లికి కోపం 

కూరలో ఉప్పు, లేదా కారం వంటివి సరిగ్గా సరిపోయాయా? లేదా? అని తెలుసుకోవడానికి, ఏవైనా సరిపోకపోతే వేయడానికి మనలో చాలా మంది టేస్ట్ చూస్తుంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం.. వంట చేసేటప్పుడు దాని రుచి అస్సలు చూడకూడదని చెప్తారు. ఇలా చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందని నమ్ముతారు. 
 

Latest Videos



ఆహార స్వచ్ఛత

వంట చేసేటప్పుడు పదే పదే రుచి చూస్తే దాని స్వచ్ఛత దెబ్బతింటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి దాని స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జ్యోతిష్యులు చెబుతారు. అందుకే వంట చేసేటప్పుడు దాని టేస్ట్ చూడకూడదని చెప్తారు. 

గోమాత భోగం 

హిందూ మతం ప్రకారం.. ఆహారంలో మొదటి భాగం గోమాత, దేవుడికి చెందుతుందని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో మీరు వంట చేసేటప్పుడు రుచి చూస్తే అది తప్పుడు ఆహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి వంట చేసేటప్పుడు టేస్ట్ చూడకండి. 

అశుభ ఫలితాలు 

కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా? తక్కువైందా? అని తెలుసుకోవడానికని మీరు రుచి చేస్తే అది మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేస్తే మీకు అశుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు ఎన్నో సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. 

ఆర్థిక ఇబ్బందులు

వంటను ఆహారాన్ని తయారు చేసేటప్పుడు రుచి చూడటం మీకు బాగానే అనిపించినా ఇది అన్నపూర్ణ దేవికికోపం తెప్పతిస్తుంది. ఈ కారణంగా  ఇలాంటి వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

జీవితంలో సమస్యలు

మీరు వంట చేసేటప్పుడు దాని రుచి చేస్తే.. మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. కాబట్టి వంట చేసేటప్పుడు పొరపాటున కూడా ఫుడ్ రుచి చూడకండి. ఆహార స్వచ్ఛత, పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ముందుగా ఆహారాన్ని తయారు చేసి దేవుడికి సమర్పించండి.

click me!