దీపావళికి ఏ రాశివారు ఏ రత్నం కొనాలో తెలుసా?

First Published | Oct 21, 2024, 12:17 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం  ఏ రాశివారు ఏ రత్నం కొనుగోలు చేయాలో, ఏ రత్నం కొనుగోలు చేస్తే.. వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం..

gemstone benefits

ప్రతి సంవత్సరం దీపావళి పండగను ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటాం. అయితే.. దీపావళికి ముందు హిందువులంతా ధంతేరాస్ అంటే ధనత్రయోదశిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే.. ఇంటికి అదృష్టం తెస్తుందని  నమ్ముతారు. మరి.. బంగారం కొనేటప్పుడు రత్నాలను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి.. జోతిష్యశాస్త్రం ప్రకారం  ఏ రాశివారు ఏ రత్నం కొనుగోలు చేయాలో, ఏ రత్నం కొనుగోలు చేస్తే.. వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం..

telugu astrology

ఈ ధనత్రయోదశి రోజున ఏ రాశివారు ఏ రత్నాలు కొనుగోలు చేయాలి..?

1.మేష రాశి…

మేష రాశికి చెందిన వారు ఈ ధనత్రయోదశి రోజున మీరు పగడపు రత్నాన్ని కొనుగోలు చేయాలి. ఈ రత్నం ధరించడం వల్ల.. మీ పూర్వ పుణ్య కర్మలను సక్రియం చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది జీవితాన్ని మార్చేస్తుంది. లేదంటే పసుపు నీలమణి రత్నాన్ని అయినా ధరించవచ్చు. ఈ రెండు రాళ్లు మీకు అదృష్టంగా మారతాయి.


telugu astrology

2.వృషభ రాశి…

వృషభ రాశివారు  జోతిష్యశాస్త్రం ప్రకారం..  డైమండ్ లేదంటే ఆకుపచ్చ పచ్చ, లేదంట నీలం నీలమణి రత్నాన్ని కొనుగోలు చేయాలి. ఈ రత్నాలు ధరించడం మీకు అద్భుతంగా ఉంటుంది.

telugu astrology

3.మిథున రాశి..

మిథున రాశికి చెందిన వారు పచ్చ, డైమండ్, నీలమణి రత్నాలు కొనుగోలు చేసి ధరించాలి. ఇలా చేయడం వల్ల వారికి మంచి జరుగుతుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.

telugu astrology

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు  తమ లైఫ్ మారిపోవాలంటే.. ఈ రాశివారు పగడం లేదంటే పసుపు నీలమణి లేదంటే.. ముత్యాలను ఎంచుకోవాలి. ఈ మూడింటలో ఏది ధరించినా .మీకు అదృష్టం లభిస్తుంది..

telugu astrology

5.సింహ రాశి…

సింహ రాశివారు.. మీ లైఫ్ మారిపోవాలంటే.. ఈ ధనత్రయోదశి రోజున రూబీ, పసుపు, నీలమణి లేదంటే పగడపు రత్నాన్ని కొనుగోలు చేయాలి.

telugu astrology

6.కన్య రాశి…

.కన్య రాశివారు ధనత్రయోదశి రోజున  పచ్చ, నీలమణి లేదంటే వజ్రం కొనుగోలు చేయవచ్చు. ఇలా చేస్తే.. వీరికి మంచి జరుగుతుంది.

telugu astrology

7.తుల రాశి..

తుల రాశివారు తమ జీవితాన్ని మార్చే రాయి ఏదైనా ఉంటే..అది వజ్రం. మీరు అనుకున్నవన్నీ నిజం కావాలి అంటే.. నీలమణి రాయిని  ఎంచుకోవాలి. ఈ రాయి మీ అదృష్టాన్ని పెంచుతుంది.

telugu astrology

8.వృశ్చిక రాశి…

వృశ్చిక రాశివారు జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ ధనత్రియోదశి సమయంలో పగడం, పసుపు నీలమణి లేదంటే ముత్యం ధరించాలి. ఇవి కొనుగోలు చేస్తే.. మీకు మంచి జరుగుతుంది.

telugu astrology

9. ధనస్సు రాశి..

ధనస్సు రాశివారు  ఈ దీపావళి సమయంలో… పసుపు నీలమణి, పగడం లేదంటే రూబీ రత్నాన్ని కొనుగోలు చేసి ధరించాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశివారికి ఈ రత్నాలు అదృష్టాన్ని తెస్తాయి.

telugu astrology

10.మకర రాశి..

మకర రాశివారు  జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ ధనత్రయోదశి సమయంలో  నీలమణిచ డైమండ్ లేదంటే.. పచ్చరత్నం కొనుక్కోవాలి. ఇవి మీకు మంచి చేస్తాయి.

telugu astrology

11.కుంభ రాశి..

కుంభ రాశివారు ఈ ధనత్రయో దశి రోజున నీలి మణి, పచ్చ లేదంటే డైమండ్ ని కొనుగోలు చేయవచ్చు. ఇలా చేస్తే వీరికి మంచి జరుగుతుంది.

telugu astrology

12.మీన రాశి..

మీన రాశివారు ఈ ఏడాది ధనత్రయోద శి రోజున పసుపు నీలమణి, ముత్యాలు, పగడాలు కొనుగోలు చేయాలి. ఇవి.. ఈ రాశివారికి మేలు చేస్తాయి.

Latest Videos

click me!