Jupiter Transit: శ్రావణమాసంలో అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది

Published : Jun 14, 2026, 09:39 AM IST

Jupiter Transit: శ్రావణమాసం వచ్చేస్తోంది. ఆ మాసంలో గురుగ్రహం పుష్య నక్షత్రంలో ఒక అరుదైన యోగాన్ని ఏర్పరచబోతోంది. నెల రోజులపాటు ఈ యోగం ప్రభావం 5 రాశులపై ఉంటుంది. వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి.

PREV
15
మేష రాశి

గురు పుష్య యోగం వల్ల మేషరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరు ఆస్తి, వాహనాలు కొనే అవకాశం ఉంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు లేదా కొత్త ఉద్యోగం తగ్గవచ్చు.

25
మిథున రాశి

మిథున రాశి వారికి గురు పుష్య యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరు ఆర్థికంగా బలంగా మారుతారు. వీరు ఆదాయంలో పెరుగుదల సంకేతాలను స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇతరుల చేతిలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వీరి చేతికి రావచ్చు. ఆదాయం మార్గాలు కూడా తెరుచుకుంటాయి.

35
కర్కాటక రాశి

గురు గ్రహం కర్కాటక రాశిలోనే ఉంది. ఇది ఆ గ్రహం ఉచ్ఛ రాశి. కాబట్టి గురు పుష్య యోగం కర్కాటక రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశి వారు జీవితంలో కొత్త మార్గాలను, గొప్ప అవకాశాలను పొందే సంకేతాలు కనిపిస్తున్నాయి.

45
తులా రాశి

తులా రాశి వారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు తగ్గుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి.

55
మీన రాశి

మీన రాశి వారికి ప్రేమలో విజయం దక్కుతుంది. పిల్లల వల్ల శుభవార్తలు వింటారు. కళాత్మక రంగాలలో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఈ యోగం వల్ల ధ్యానం, శివారాధన, విష్ణు ఆరాధన చేస్తే ఎంతో మంచిది. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చినా కూడా మంచి ఫలితాలు దక్కుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories