Shiva Yogam: వారం రోజుల్లో అరుదైన శివయోగం.. ఆ మహాశివుని అనుగ్రహం ఈ 3 రాశులవారిపైనే

Published : Jun 18, 2026, 10:06 AM IST

Shiva Yogam: జ్యోతిష్య శాస్త్రంలో శివయోగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది గొప్ప, శుభకరమైన యోగాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ అరుదైన యోగం జూన్ 24, 2026న ఏర్పడబోతోంది. ఒకరోజు మాత్రమే ఉండే ఈ యోగం మూడు రాశుల వారికి మంచి రోజులు ఇస్తుంది.

PREV
13
మిథున రాశి

మిథున రాశి వారికి శివయోగం వారి జీవితంలో అనుకూల మార్పులను తీసుకొస్తుంది. వీరు ఆఫీసులో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గుర్తింపు దక్కుతుంది. ఎన్నో ప్రశంసలు దక్కుతాయి.  చేస్తున్న ఉద్యోగంలో లేదా పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు.  లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఎలాంటి అడ్డు లేకుండా పూర్తవుతాయి. స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

23
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శివ యోగం బాగా కలిసివస్తుంది.  ఆర్థికంగా వీరికి పెద్ద ఎదుగుదలను ఇచ్చే అవకాశం ఉంది. వీరికి ఆకస్మిక ధనలాభం సూచనలు కనిపిస్తున్నాయి. దీని వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశివారికి ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఈ రాశివారు పెట్టే పెట్టుబడులు బాగా కలిసివస్తాయి.  కుటుంబ అవసరాలను తీరుతాయి.  ఈ రాశి వారు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

33
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. వీరి జీవితంలోని గందరగోళాలు తొలగిపోయి స్పష్టత వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల పూర్తి సపోర్టు, సహకారం అందుతాయి. ఈ సమయంలో ఈ రాశివారు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాలనుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిల్లల విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories