ఆగస్టు నెలలో గ్రహాల గమనంలో చాలా పెద్ద పెద్ద మార్పులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఒకదాని తర్వాత ఒకటిగా రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ ఆగస్టు నెలలోనే గజలక్ష్మీ రాజయోగాలు, లక్ష్మీ నారాయణ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రడు, బృహస్పతి శుభ కలయిక కారణంగా, ఆగస్టు 20 వ తేదీ వరకు మిథున రాశిలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పుడుతుంది. ఈ రాజయోగ ప్రభావం కారణంగా ఒక వ్యక్తి సంపద, కీర్తి, గౌరవం లభిస్తాయి. దీని ప్రభావం కలిగిన వ్యక్తుల జీవితం రాజులా మారుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఊహించని విధంగా కలుగుతాయి.సమాజంలో ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. ఇక.. ఆగస్టు21 వ తేదీ నుంచి కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. మరి.. ఈ రెండు యోగాలు ఆగస్టు నెలలో మూడు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలిగించనున్నాయి. మరి, ఆ అదృష్ట మూడు రాశులేంటో చూద్దాం..