Rahu : జోతిష్యశాస్త్రంలో రాహును దుష్ట గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. దీని కారణంగా నాలుగు రాశుల వారికి అనుకోని కష్టాలు రానున్నాయి.
జోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు.. కొన్ని రాశుల జీవితాలను పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి. రాహు నక్షత్ర మార్పు అలాంటి మార్పులే చేయనుంది. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న ఈ రాహు.. జూన్ 30న తన నక్షత్రాన్ని మార్చుకుంటోంది. ఆ రోజు దనిష్ఠ నక్షత్రంలోకి అడుగుపెడుతుంది. దీని కారణంగా అంగారకయోగం ఏర్పడుతోంది. ఇది.. కొన్ని రాశుల వారికి ఊహించని కష్టాలు తీసుకురానుంది. డిసెంబర్ 2 వరకు ఈ అంగారక యోగం ఉంటుంది. ఈ సమయంలో..ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి, ఇబ్బంది పడే ఆ రాశులేంటో చూద్దాం..
25
తుల రాశి..
అంగారక యోగం తుల రాశివారికి కూడా లేనిపోని కష్టాలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. పెట్టుబడులు పెడితే.. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం కూడా రాదు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.
35
ధనుస్సు రాశి..
అంగారక యోగం కారణంగా ధనుస్సు రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన ఏ విషయంలోనూ వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ, వీలైనంత వరకు ఓపికగా ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదంటే.. మాట జారి సమస్యల్లో చిక్కుకుంటారు.ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మానసికంగా చాలా కృంగిపోతారు.
అంగారకయోగం మేష రాశివారికి కూడా అనుకూలంగా ఉండదు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.ఏదైనా పెట్టుబడి పెట్టేముందు ఆచితూచి అడుగులు వేయాలి.లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడతారు.
55
వృశ్చిక రాశి..
అంగారకయోగం వృశ్చిక రాశివారికి కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్థులకు పనిచేసే చోట తోటి ఉద్యోగులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.