కన్య రాశి..
జోతిష్యశాస్త్రం ప్రకారం రాహు,కేతు, శని గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో అంటే ఈ ఏడాది చివర్లో కన్య రాశివారికి ఊహించని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో కన్య రాశిలో జన్మించినవారు తొందరపడ నిర్ణయాలు తీసుకోకూడదు.అంతేకాదు.. ఎంత కష్టపడినా కూడా ఓటమి చూవి చూడాల్సి వస్తుంది. ఈ కాలంలో.. ఉద్యోగంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.చిన్న పొరపాటు చేసినా కూడా అధికారుల ఆగ్రహానికి గురికావచ్చు. కాబట్టి.. ఏ పని చేసినా ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపారాల్లోనూ నష్టాలు రావచ్చు. డబ్బు విషయంలో ఎవరినీ తొందరపడి నమ్మకపోవడం మంచిది. ఈ సమస్యలు తగ్గడానికి శనివారం శని చాలీసా పఠించాలి.మృత్యుంజయ మంత్రం పఠించాలి.