Zodiac Signs: కుంభ రాశిలోకి రాహువు, ఈ మూడు రాశులకు కష్టకాలమే..!

Published : Apr 19, 2025, 03:36 PM IST

రాహువు మీన రాశిని విడిచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ సమయంలో గ్రహాల అధిపతి అయిన మంగళుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి 150 డిగ్రీల దూరంలో ఉంటాయి.

PREV
14
Zodiac Signs: కుంభ రాశిలోకి రాహువు, ఈ మూడు రాశులకు కష్టకాలమే..!
Rahu Transition


మంగళుడు(కుజుడు), రాహువు ఒకే రాశిలో కలుసుకోవడాన్ని షడాష్టక యోగం అని అంటారు. ఇది పలు రాశులపై శక్తివంతమైన ప్రభవాన్ని చూపిస్తుంది.ముఖ్యంగా సింహ రాశి సహా మరికొన్ని రాశులవారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా పడనుంది. రాబోయే 19 రోజుల పాటు అనుకోని మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా వ్యవహరించడం ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనలు, హనుమాన్ చాలీసా పఠించడం లాంటివి చేయాలి. మరి.. ఈ షడాష్టక యోగం ఎక్కువ ప్రభావం చూపించే రాశులేంటో, ఈ 19 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన రాశులేంటో చూద్దామా...
 

24
telugu astrology


షడాష్టక యోగం సమయంలో సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి జాతకులు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, వారి జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఈ రాశి వారు ఓర్పు, సంయమనంతో వ్యవహరించాలి. పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

34
telugu astrology

షడాష్టక యోగం కారణంగా, ధనుస్సు రాశి వారు కొన్ని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు. మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో విదేశ ప్రయాణాలు చేయకండి.

44
telugu astrology


మీనరాశి వారికి షడాష్టక యోగం అశుభకరంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మీన రాశివారు  ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకండి. ఉద్యోగ స్థలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories