మకర రాశి..
రాహు, కేతువుల నక్షత్ర మార్పు మీ కెరీర్, ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. రాహువు మీ పనిలో కొత్త బాధ్యతలు, అవకాశాలను తెస్తాడు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. కేతువు సంచారం కుటుంబ వాతావరణంలో సామరస్యాన్ని పెంచుతుంది. మనశ్శాంతి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా పాత పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. ధ్యానం, యోగా మీ మనోధైర్యాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుతాయి.