Today Rasi Phalalu: నేడు ఈ 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!

Published : Jul 04, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 04.07.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త అప్పులు చేస్తారు. భూ వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

313
వృషభ రాశి ఫలాలు

నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

413
మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా అనుకూలం.

513
కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు.

613
సింహ రాశి ఫలాలు

రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనుల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు

సోదరుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఆధాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

1113
మకర రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కలుగుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు

శ్రమతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.

1313
మీన రాశి ఫలాలు

నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పెద్దల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories