Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారు పొరపాటున కూడా ఎవ్వరిని మోసం చేయరు..!

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, సమయం చాలా ముఖ్యమైనవి. వీటి ద్వారా వ్యక్తుల గుణ గణాలు, భవిష్యత్, ఇతర విషయాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. నీతి, నిజాయతీ వారి ఇంటి పేరుగా ఉంటుంది. చాలా ధైర్యంగా ఉంటారు. అంతేకాదు వీరిని ఎంతనమ్మినా ఎలాంటి ప్రమాదం ఉండదట. మరి ఆ అరుదైన పుట్టిన తేదీలు ఏంటో? దాంట్లో మీది గాని, మీకు తెలిసిన వారిది కానీ ఉందో ఓసారి చెక్ చేసుకోండి.

జ్యోతిష్య శాస్త్రం లాగే సంఖ్యా శాస్త్రం కూడా చాలా ప్రత్యేకమైంది. పుట్టిన తేదీ, టైం ఆధారంగా సంఖ్యా శాస్త్రాన్ని ఉపయోగించి వ్యక్తుల గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రత్యేక గుణాలు కలిగి ఉంటారు. వారు చాలా ధైర్యవంతులు. నీతి నిజాయతీతో బతుకుతారు. ఎవ్వరినీ మోసం చేయడానికి ఇష్టపడరు. మరి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్లు పుట్టిన తేదీలెంటో ఓసారి చూసేద్దామా.

చాలా ధైర్యవంతులు

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21 లేదా 30 తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరి రాడిక్స్ 3. వీళ్లు చాలా ధైర్యవంతులు, వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. రాడిక్స్ 3 ఉన్నవాళ్లు చాలా ఓపెన్ మైండెడ్. వారి జీవితాన్ని నిజాయితీగా బతకాలనుకుంటారు. వీళ్ల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరికీ చెడు చేయాలనుకోరు. మరీ ముఖ్యంగా ఎవరినీ మోసం చేయరు.


ఎవరి జోలికి వెళ్లరు!

సంఖ్యా శాస్త్రం ప్రకారం రాడిక్స్ 3 ఉన్నవాళ్లు కవి హృదయం కలవారు. వాళ్ళ పనిలో ఎవరైనా వేలు పెడితే అస్సలు ఇష్టపడరు. వీళ్లు శాంతిని కోరుకుంటారు. మృదువుగా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు. వీళ్లు ఎవరి జోలికి పోరు. ఎవరు వాళ్ల జోలికి రావద్దని కోరుకుంటారు.

కష్టపడి పనిచేసే తత్వం

ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా తెలివైనవాళ్లు, ధైర్యవంతులు. మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే వరకు ఊరుకోరు. వాళ్ళకి ఇష్టమైన పని అయిపోయాకే నిట్టూరుస్తారు. పని పూర్తి చేయడానికి ఎంతైనా కష్టపడతారు.

కలిసొచ్చే రోజు

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి గురువారం శుభ దినం. ఆ రోజు వారు ఏదైనా పని మొదలు పెడితే అది చాలా శుభంగా ఉంటుందని నమ్ముతారు. వీరు కుటుంబాన్ని, సమాజాన్ని ప్రేమిస్తారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

దేనికైనా రెడీగా ఉంటారు!

ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ వ్యాపారానికైనా, పనికైనా రెడీగా ఉంటారు. వీళ్లు కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారు. పెద్ద పనులను కూడా సులువుగా చేసేస్తారు. వీళ్ళు మంచి నాయకులు, వ్యాపార యజమానులు కాగలరు. ఎక్కువగా ఉద్యోగం కంటే వ్యాపారంలోనే ఆసక్తి చూపిస్తారు. వీరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి.

Latest Videos

click me!