Birth Date: న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన నెల, తేదీ, టైం మన భవిష్యత్తుపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తాయి. మన స్వభావాన్ని బయటపెడతాయి. కొన్ని తేదీల్లో పుట్టినవారు ఎవ్వరికీ నచ్చరు. ఆ తేదీలేంటో.. వారిని ఇతరులు ఎందుకు ఇష్టపడరో ఇక్కడ తెలుసుకుందాం.
వ్యక్తుల స్వభావాన్ని, ప్రవర్తనను, అదృష్టాన్ని అంచనా వేసే ప్రత్యేకమైన శాస్త్రం.. సంఖ్యాశాస్త్రం. ఇప్పటికీ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. సంఖ్యా శాస్త్రం ఆధారంగా వ్యక్తుల పుట్టిన తేదీ, టైం వారి భవిష్యత్తును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కొన్ని తేదీల్లో పుట్టినవారిని అందరూ ఇష్టపడితే.. మరికొన్ని తేదీల్లో పుట్టినవారిని ఎవ్వరూ ఇష్టపడరు. వారి జన్మతేదీ, గ్రహాల ప్రభావం అందుకు కారణం కావచ్చు. మరి ఏ తేదీల్లో పుట్టినవారిని ఎవ్వరు ఇష్టపడరో.. అసలు ఎందుకు ఇష్టపడరో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
25
సంఖ్యాశాస్త్రం ప్రకారం..
కొన్ని తేదీల్లో జన్మించినవారు సాధారణంగా కఠిన స్వభావం, స్వార్థం, ఇతరుల భావాల పట్ల చులకన భావం కలిగి ఉంటారు. దానివల్ల వారు సులభంగా అందరితో కలవలేరు. కాబట్టి వీరు అందరికీ నచ్చకపోవచ్చు. మరి ఏ నెలలో.. ఏ తేదీల్లో పుట్టిన వారు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.
35
మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు
సాధారణంగా 7, 16, 25వ తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 7 అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, జులై, ఆగస్టు నెలల్లో 7, 16, 25వ తేదీల్లో పుట్టినవారిపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా తక్కువగా మాట్లాడుతారు. వారి భావాలను లోపలే దాచుకునే స్వభావం కలిగి ఉంటారు. దానివల్ల ఎవ్వరితో పెద్దగా కలవరు. అంతేకాదు వీరు చూడడానికి చాలా సీరియస్ గా కనిపిస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారిని చూస్తే.. వీరు ఎవ్వరికీ దగ్గరయ్యే వ్యక్తులు కాదు అనే ఫీలింగ్ ఎదుటివారికి కలుగుతుంది. అందుకే వీరికి ఎవ్వరు దగ్గర కారు. వీరు ఎవ్వరికీ నచ్చరు.
ఏ నెలలో అయినా 8, 17, 26వ తేదీల్లో పుట్టినవారిపై శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు క్రమశిక్షణ, కఠినత్వం, గంభీరతకు ప్రాధాన్యం ఇస్తారు. ఎదుటివారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. దానివల్ల వీరు అందరికీ నచ్చకపోవచ్చు. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్నదే చేయాలనుకునే ధృడమైన సంకల్పం కలిగి ఉంటారు. నిజాయితీగా ఉంటారు. వీరి కచ్చితమైన, స్పష్టమైన అభిప్రాయాలు ఇతరులకు అంతగా నచ్చకపోవచ్చు. దానివల్ల వీరిని ఇష్టపడటం కష్టం.
55
వీరి స్వభావమే కారణం..
ఈ తేదీల్లో పుట్టినవారు సాధారణంగా ఒకే ధోరణిలో ఉంటారు. ఇతరుల భావాలను అంతగా పట్టించుకోరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రతీ విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. తాము నమ్మిందే సరైంది అనుకుంటారు. వీరికి దగ్గర కావాలంటే చాలా టైం పడుతుంది. దానివల్ల వీరు మంచి స్నేహితులను, బంధాలను కోల్పోతుంటారు. వీరికి ఆప్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వీరి స్వభావం కొంతమందికి ఆత్మాభిమానంలా అనిపించినా.. చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది.
గమనిక
ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు.. జ్యోతిష్య పండితుల సలహాలు, సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.