సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి తేదీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. మరి ఆ తేదీలు ఏవి? ఆ రోజుల్లో పుట్టినవారిలో కనిపించే ప్రత్యేక లక్షణాలు ఏంటి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
మనిషి జీవితంలో పుట్టిన తేదీకి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన రోజు, నెల, సంవత్సరం ద్వారా వ్యక్తి స్వభావం, అదృష్టం, భవిష్యత్ గురించి కొన్ని విషయాలు అంచనా వేయవచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టినవారు జీవితంలో చాలా త్వరగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. ఆ తేదీలేంటో చూద్దాం.
25
మూలసంఖ్య 1- సూర్యుడి ప్రభావం
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు మూలసంఖ్య 1 కిందకు వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. నాయకత్వం, ధైర్యం, గౌరవానికి ప్రతీక సూర్యుడు. అందువల్ల ఈ తేదీల్లో పుట్టినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. జీవితంలో ఎదగాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరు సాధారణంగా ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ముందుకు సాగాలని ప్రయత్నిస్తారు. ఫలితంగా చాలా ఫాస్ట్ గా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
35
మూలసంఖ్య 5- బుధుడి ప్రభావం
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 5. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. తెలివితేటలు, చురుకుదనం, వ్యాపార దృష్టి వంటి లక్షణాలకు ప్రతీక బుధుడు. అందువల్ల ఈ తేదీల్లో పుట్టినవారు సాధారణంగా చాలా తెలివిగా ఆలోచిస్తారు. కొత్త అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకునే నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యాపారం, కమ్యూనికేషన్, మీడియా, టెక్నాలజీ వంటి రంగాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు మూలసంఖ్య 8 కిందకు వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి శని గ్రహం. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, సహనం వంటి లక్షణాలకు కారకుడు శని. ఈ తేదీల్లో పుట్టినవారు జీవితం ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, తర్వాత పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
55
కష్టపడే స్వభావం ఉంటే..
జీవితంలో విజయం సాధించడానికి పుట్టిన తేదీ వంటివి ఎంత ముఖ్యమో.. కష్టపడే స్వభావం, సరైన అవకాశాలను ఉపయోగించుకునే తెలివితేటలు కూడా అంతే ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. సరైన దిశలో ప్రయత్నాలు చేస్తే ఎవరైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెబుతున్నారు.