Birth Date: ఈ తేదీల్లో పుట్టిన చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు.. ఎవరైనా వీళ్ల మాయలో పడైపోవాల్సిందే

Published : Jun 06, 2026, 02:57 PM IST

Birth Date:న్యూమరాలజీ మన భవిష్యత్తు మాత్రమే కాదు.మన వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి లుక్స్, మాటలతో అందరినీ ఇట్టే మాయలో పడేయగలరు.  ఆ తేదీలేంటో చూద్దాం 

PREV
14
Attractive People

నెంబర్ 3...

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు సహజంగానే చాలా అందంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వానికీ, అందానికీ ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా వీరి నవ్వు చాలా బాగుంటుంది.

24
నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఎవరినైనా తమ ప్రేమలో పడేయగలరు. వీరి పట్ల ఎవరైనా చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు. వీరు కూడా అందరితోనూ చాలా సరదాగా ఉంటారు. ఈ ప్రవర్తనే అందరికీ నచ్చేస్తుంది.

34
నెంబర్ 6...

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. శుక్రుడు విలాసానికి ప్రతీక. కాబట్టి.. వీరి జీవితం కూడా అలానే ఉంటుంది. అంతేకాకుండా.. వీరు చాలా అందంగా ఉంటారు. వీరి ప్రవర్తన, వ్యక్తిత్వం కూడా అందరికీ బాగా నచ్చుతాయి. అందరితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే అందరూ వీరికి ఆకర్షితులు అవుతారు.

44
నెంబర్ 7..

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 7 కిందకు వస్తారు.ఈ రాశివారిపై కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కానీ, అయితే.. వీరు అందరితోనూ చాలా హుందాగా ఉంటారు. అందుకే... వీరిని ఎక్కువ మంది ఇష్టపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories